HomeMoviesటాలీవుడ్వంద కోట్ల క్లబ్ లోకి చేరిన ‘లక్కీ భాస్కర్‘

వంద కోట్ల క్లబ్ లోకి చేరిన ‘లక్కీ భాస్కర్‘

-

దీపావళి బరిలో విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూనే ఉంది. తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో స్టెడీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ‘లక్కీ భాస్కర్’ లేటెస్ట్ గా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ‘లక్కీ భాస్కర్‘ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూళ్లు సాధించినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

‘లక్కీ భాస్కర్‘ సినిమా వంద కోట్లు వసూళ్లను సాధించిన నేపథ్యంలో.. సినిమా నుంచి ఓ స్పెషల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది టీమ్. సినిమాలోని విజువల్స్ తో కట్ చేసిన ఈ హండ్రెడ్ క్రోర్స్ బ్లాక్ బస్టర్ ట్రైలర్ వైవిధ్యంగా ఆకట్టుకుంటుంది. ఆద్యంతం డబ్బు చుట్టూ సాగే ఈ సినిమాలోని కంటెంట్ ను ఉపయోగించుకుంటూ.. ‘లక్కీ భాస్కర్‘ వంద కోట్లను సాధించిన విషయాన్ని కొత్త ట్రైలర్ తో తెలిపారు.

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో వెంకీ అట్లూరి ఈ సినిమాని తెరకెక్కించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ‘లక్కీ భాస్కర్‘ను నిర్మించాయి.

ఇవీ చదవండి

English News