తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటుదాం.. నాగ్ అశ్విన్

హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలకు ఇండియాలో ఎంతో క్రేజుంది. మార్వెల్, డిసి కి సంబంధించిన కొన్ని సూపర్ హీరో చిత్రాలైతే.. ఇక్కడ వందల కోట్లు వసూళ్లు సాధించిన సందర్భాలున్నాయి. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘కల్కి’ గురించి ఆసక్తికర పోస్ట్ చేశాడు.

‘మనం ఇప్పటివరకూ మార్వెల్, డీసీ చిత్రాలు ప్రమోట్ చేసాం. ఇక ఇప్పుడు మన కల్కి 2898 ఎడి ని ప్రమోట్ చేద్దాం’ అంటూ తన ఇన్ స్టా స్టోరీస్ లో తెలిపాడు నాగ్ అశ్విన్. అలాగే.. ‘బాహుబలి’తో ప్రభాస్ ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. ఇప్పుడు ‘కల్కి’తో మరోసారి ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటే సమయం వచ్చిందంటూ తన స్టోరీలో ప్రస్తావించాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం నాగ్ అశ్విన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 27న వరల్డ్ వైడ్ గా ‘కల్కి’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts