లియో రెస్పాన్స్ మామూలుగా లేదు

ఇలయదళపతి విజయ్ అంటేనే ఊర మాస్. తమిళనాట అత్యధిక మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. అలాంటి విజయ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆ హంగామా మామూలుగా ఉండదు. గత వారం రోజుల నుంచే ‘లియో‘ అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించిన హడావుడి ఓ రేంజులో జరిగింది. ఇక.. ఎర్లీ మార్నింగ్స్ నుంచి థియేటర్ల వద్ద ‘లియో‘ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు.

కోలీవుడ్ లో ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ సినిమాటిక్ యూనివర్శ్ నే సృష్టించుకున్న లోకేష్ కనకరాజ్ ‘లియో‘కి డైరెక్టర్. ఇప్పటికే విజయ్, లోకేష్ కాంబోలో ‘మాస్టర్‘ వంటి సినిమా రావడంతో ‘లియో‘పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక.. ఈరోజు గ్రాండ్ లెవెల్ లో రిలీజైన ‘లియో‘కి రెస్పాన్స్ ఎలా ఉంది?

విజయ్ ని ఎక్కువగా మనం ఒకే లుక్ లో చూస్తుంటాం. అయితే.. ఈ సినిమాలో మాత్రం విజయ్ లుక్ విషయంలో లోకేష్ కనకరాజ్ ఎక్కువ కేర్ తీసుకున్నాడు. ఆయన నెవర్ బిఫోర్ లుక్ లో ఆన్ స్క్రీన్ పై కనిపించాడనే అప్లాజ్ వస్తోంది. ఈ మూవీలో హైనా తో విజయ్ పోరాడే సన్నివేశం కూడా సినిమాకి హైలైట్ అంటున్నారు. ఆ ఫైట్ కి సంబంధించిన కొన్న క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

ఇంకా.. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి లోకేష్ టైట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టాడనే ప్రశంసలు వస్తున్నాయి. అలాగే.. ఈ మూవీలో చాలా అన్ ఎక్స్ పెక్టెడ్ సర్ప్రైజెస్ కూడా ఉన్నాయట.

లియో క్లైమాక్స్ లో రోలెక్స్ తో ఫోన్ కాల్ ఎపిసోడ్ ఉంటుందట. అలాగే.. ‘ఖైదీ‘లో ఉండే కానిస్టేబుల్ పాత్రను కూడా ఈ మూవీకి కనెక్ట్ చేశారు. దాంతో.. ‘లియో‘ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ లో భాగమనే విషయం స్పష్టమవుతోంది. ఇక.. క్లైమాక్స్ లో ‘లియో‘కి సీక్వెల్ ఉంటుందని కన్ఫమ్ చేశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.

ఎప్పటిలానే అనిరుధ్ బి.జి.ఎమ్. ఈ సినిమాకి బ్యాక్ బోన్ అనే ప్రశంసలు వస్తున్నాయి. మిగతా క్యారెక్టర్స్ విషయానికొస్తే.. త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, మ్యాథ్యూ థామస్ రోల్స్ కూడా బాగా కుదిరాయనే టాక్ వినిపిస్తుంది. అయితే.. ‘లియో‘కి పాజిటివ్ టాక్ ఎంత వస్తుందో.. అలాగే కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. మరికొన్ని గంటల్లోనే ‘లియో‘ ఫైనల్ టాక్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.

Related Posts