మొహియుద్దీన్ భాయ్ గా లాల్ సలామ్ అంటోన్న రజినీకాంత్

సూపర్ స్టార రజినీకాంత్ ఫ్యాన్స్ కు అనుకోని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆయన కొత్త సినిమా లాల్ సలామ్ నుంచి ఓ కొత్త పోస్టర్ విడుదల చేస్తారు అని ముందే ప్రకటించారు. కానీ టైటిల్ కు తగ్గట్టుగా చాలా చాలా ఊహించుకున్న ఫ్యాన్స్ ఎవరూ ఊహించిన లుక్ తో ఆశ్చర్యపరిచాడు. అసలు ఈ లుక్ ను ఆయన పేరును ఎవరూ ఊహించలేదు అంటే అతిశయోక్తి కాదు.

మరో విశేషం ఏంటంటే.. కొన్నాళ్ల క్రితం కొచ్చడయాన్ అంటూ రజినీకాంత్ తో ఓ యానిమేషన్ సినిమా డైరెక్ట్ చేసిన ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోంది. కూతురు కోసమే మరోసారి ఈ చిత్రానికి ఒప్పుకున్నాడు అనుకున్న వారికి అంతకు మించిన కంటెంట్ కూడా ఉండబోతోంది అనేలా ఉందీ పోస్టర్.


లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి లాల్ సలామ్ అనే టైటిల్ పెట్టినప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. దీనికి మించి అనేలా ఇప్పుడీ మూవీ నుంచి సూపర్ స్టార్ ను ‘మొహియుద్దీన్ భాయ్”గా పరిచయం చేసింది మూవీ టీమ్.

చార్మినార్ లాంటి కట్డం చుట్టుపక్కల ఓ పెద్ద గలాటా జరిగినట్టు కనిపిస్తుండగా.. అందులో నుంచి ముసల్మాన్ భాయ్ గా రజినీకాంత్ నడుచుకుంటూ వస్తోన్న ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తంగా మరోవైపు జైలర్ అనే సినిమాతో ఆల్రెడీ న్యూస్ లో ఉన్న రజినీ.. ఈ సారి లాల్ సలామ్ తో మరోసారి ఆకట్టుకుంటున్నాడు.

Related Posts