పాన్ ఇండియా సినిమా ప్రకటించిన కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ సొంత శైలి సృష్టించుకున్నాడు కిరణ్ అబ్బవరం. అతని నుంచి సినిమా వస్తుందంటే.. అది సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందనే అంచనా ఆడియన్స్ లో ఉంది. అయితే.. కిరణ్ గత చిత్రాలు ‘మీటర్, రూల్స్ రంజన్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈనేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకుని ఈసారి టాలీవుడ్ నే కాకుండా.. పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ కొత్త సినిమాతో ముస్తాబవుతున్నాడు కిరణ్ అబ్బవరం.

‘క‘ అనే టైటిల్ తో కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ మూవీ ప్రీ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ లో కిరణ్ వెనక్కి తిరిగి చూస్తూ ఉండగా ‘క’ అనే టైటిల్ కనిపిస్తుంది. అలాగే.. ‘క’ అనే అక్షరం వెనుక రాశుల చిత్రాలు కనిపిస్తున్నాయి. శ్రీ చక్రాస్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాని సుజీత్-సందీప్ అనే దర్శకద్వయం తెరకెక్కిస్తుందట. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ నేపథ్యంలో ‘క‘ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది.

Related Posts