HomeMoviesటాలీవుడ్కమల్ సొంత సినిమాని దక్కించుకున్న నితిన్ సంస్థ

కమల్ సొంత సినిమాని దక్కించుకున్న నితిన్ సంస్థ

-

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్‘ చిత్రం ఎలాంటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంతో పాటు.. తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ‘విక్రమ్‘ చిత్రాన్ని తెలుగులో యూత్ స్టార్ నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ విడుదల చేసింది. ఇక.. ఇప్పుడు కమల్ నటించకపోయినా.. నిర్మిస్తూ రూపొందిస్తోన్న ‘అమరన్‘ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుంది శ్రేష్ట్ మూవీస్.

కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ‘అమరన్‘ తెరకెక్కుతోంది. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా బయోగ్రాఫికల్ డ్రామాగా రూపొందుతోంది. అశోకచక్ర మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని రాజ్ కుమార్ పెరియసామి తీర్చిదిద్దుతున్నాడు. ఆద్యంతం మిలటరీ బ్యాక్‌డ్రాప్ తో ఈ చిత్రం రాబోతుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ‘అమరన్‘ విడుదలకు ముస్తాబవుతోంది. మరి.. ‘విక్రమ్‘ సినిమా శ్రేష్ట్ మూవీస్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టినట్టే.. ‘అమరన్‘ కూడా మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

ఇవీ చదవండి

English News