‘కల్కి’ ప్రమోషనల్ స్ట్రాటజీ అదుర్స్

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’ విడుదలకు ఇంకా కేవలం 40 రోజులు మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో.. సినిమా ప్రచారంలో స్పీడు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందట టీమ్. ఇప్పటివరకూ ఇండియన్ మూవీస్ పబ్లిసిటీలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్తగా ‘కల్కి’ ప్రమోషనల్ స్ట్రాటజీని రెడీ చేస్తున్నాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్.

సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్ తో సాగే ఈ టైమ్ ట్రావెల్ మూవీ కాన్సెప్ట్ అర్థం కావడానికి ఓ స్పెషల్ యానిమేటెడ్ సిరీస్ ను సిద్ధం చేస్తున్నాడట నాగ్ అశ్విన్. నాలుగు ఎపిసోడ్స్ గా ఓ ప్రముఖ ఓటీటీలో ఆ సిరీస్ రానుందట. మరో వారం రోజుల్లోనే ‘కల్కి’ యానిమేటెడ్ సిరీస్ కు సంబంధించి ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ‘కల్కి’ నుంచి వరుసగా ప్రచార చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రభాస్ గత చిత్రం ‘సలార్’ కోసం ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొనలేదు. కేవలం ఓ కామన్ ఇంటర్యూ మాత్రమే ఇచ్చాడు. అయితే.. ‘కల్కి’ కోసం ఎక్కువగా ప్రమోషన్స్ లో పాల్గొంటాడట ప్రభాస్. అలాగే.. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సైతం సన్నాహాలు జరుగుతున్నాయట. జూన్ 27న ‘కల్కి’ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts