రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎ.డి‘ థియేట్రికల్ గా సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ‘కల్కి’ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజయ్యింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ అదిరిపోయే వసూళ్లను సాధించి.. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లను కొల్లగొట్టింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ‘కల్కి‘దే మొదటి స్థానం.
థియేట్రికల్ గా అదరగొట్టిన ‘కల్కి’ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘కల్కి‘ చిత్రం సౌత్ లాంగ్వేజెస్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘కల్కి‘ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు.. ఆగస్టు 22 నుంచే ‘కల్కి‘ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.