HomeMoviesటాలీవుడ్'కల్కి 2898 ఎ.డి' ట్రైలర్.. సరికొత్త ప్రపంచంలోకి ప్రయాణం

‘కల్కి 2898 ఎ.డి’ ట్రైలర్.. సరికొత్త ప్రపంచంలోకి ప్రయాణం

-

రెబెల్ స్టార్ ప్రభాస్ కోసం సరికొత్త ప్రపంచాలు సృష్టిస్తున్నారు దర్శకులు. ‘బాహుబలి’ సినిమాకోసం మాహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించాడు దర్శకధీరుడు రాజమౌళి. ‘సాహో’ కోసం సుజీత్ వాజీ సిటీని సృష్టిస్తే.. ‘సలార్’ కోసం ఖాన్సార్ ని క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు రెబెల్ స్టార్ ‘కల్కి’లో మరో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. లేటెస్ట్ గా ‘కల్కి 2898 ఎ.డి’ ట్రైలర్ రిలీజయ్యింది.

గతానికి భవిష్యుత్తుతో ముడిపెడుతూ సరికొత్త కథాంశంగా ‘కల్కి’ని రూపొందించాడు. గతంలో జరిగిన మహాభారతాన్ని ఆవిష్కిరస్తూనే.. 2898 ఎ.డి. లో ఏం జరగబోతుంది అనే ఫ్యూచర్ ని చూపించే ప్రయత్నం ఈ సినిమాలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేయబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ భూమి మీద మొదటి నగరం అంటూ కాశీని పరిచయం చేస్తూనే.. ఓ చిన్న పిల్లాడి వాయిస్ లో ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ.. అయినా నీళ్లుంటాయట అంటూ ఫ్యూచర్లో కాశీ నగరం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనబోతుంది అనే విజువల్స్ చూపించారు.

లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే.. దేవుడు ఒక్కడే.. సుప్రీమ్ ఒక్కడే అంటూ నమ్మే వాళ్లు ఒకవైపు.. వారి బారి నుంచి ప్రజలను రక్షించడానికి అశ్వథ్థామ పాత్రలో అమితాబ్ ఏం చేశాడు? అందుకు దీపిక పదుకొనె ఎలా ఉపయోగపడింది? ఆ తర్వాత రక్షకుడిగా భైరవ ఎంట్రీ.. చివరిలో భయంకరమైన రూపంతో విశ్వనటుడు కమల్ హాసన్ వీర విహారం ‘కల్కి’ ట్రైలర్ కి మెయిన్ హైలైట్స్. ఊహల్లో కూడా ఊహించని విజువల్స్ తో ‘కల్కి’ ట్రైలర్ ఆద్యంతం విజువల్ ఫీస్ట్ అందించేలా ఉంది.

ఫ్యూచర్ కాశీ నగరం చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో పాత్రలున్నాయి. భైరవ గా ప్రభాస్, అశ్వథ్థామ గా అమితాబ్ మొదలుకొని.. దీపిక, కమల్, దిశా పటాని, రాజేంద్రప్రసాద్ వంటి చాలామంది తారాగణం ఈ ట్రైలర్ లో కనిపించారు. ఇక.. సినిమాలో ఎంతో ప్రాధాన్యమైన బుజ్జి వెహికల్ రోల్ కూడా ట్రైలర్ లో కనిపిస్తుంది.

సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎపిక్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ కథాంశం 2898 ఎ.డి.లో జరుగుతుంది. అంటే.. అప్పటి కాలామానానికి అనుగుణంగా.. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా.. అప్పటి సంస్కృతి సంప్రదాయాలను ఆవిష్కరించేలా.. నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ‘థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు తాము వేరే ప్రపంచం నుంచి మళ్లీ ఈ ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతారని’ ఆమధ్య నాగ్ అశ్విన్ అన్నట్టే.. రేపు ‘కల్కి’ విడుదల తర్వాత ప్రేక్షకులు అలాగే ఫీలవుతారేమో చూడాలి. జూన్ 27న వరల్డ్ వైడ్ గా ‘కల్కి’ విడుదలకు ముస్తాబవుతోంది.

ఇవీ చదవండి

English News