అంతా అనుకున్నట్టుగానే అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ముగింపు సభకు మళ్లీ డుమ్మా కొట్టాడు. గతంలో విజయవాడలో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఈ సారి హైదరాబాద్ లో జరుగుతున్న సభకు జూనియర్ కు ఇన్విటేషన్ ఉంది. ఫ్లెక్సీలు కూడా కొట్టించారు. అతను వస్తాడనీ.. వస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఈ రోజు తన బర్త్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న పనులు ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని అఫీషియల్ గా ప్రకటించాడు.

ఎన్టీఆర్ బర్త్ డే సంగతి అందరికీ తెలుసు. జయంతి ఉత్సవాల సభ జరిగేది సాయంత్రం. మరి అప్పటికి కూడా హాజరు కాలేడా అంటే చెప్పలేం అంటున్నారు. నిజానికి కొన్నాళ్లుగా నందమూరి ఫ్యామిలీతో జూనియర్ అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నాడు. వారి వ్యక్తిగత విషయాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపించడం లేదు. చివరికి తాతగారి ప్రతిష్టాత్మక శతజయంతి ఉత్సవాల ముగింపు సభలకూ హాజరు కావడం లేదు.


ఈ వ్యవహారం చూస్తోంటే నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్యగా మారింది అంటున్నారు. ఎందుకంటే ముందు నుంచీఅటు విజయవాడు ఇటు హైదరాబాద్ లో పెద్దాయన కార్యక్రమాలను బాలయ్యే ముందుండి నడిపిస్తున్నాడు. ఆయన కావాలని ఎన్టీఆర్ లీస్ట్ ప్రీయారిటీగా తీసుకున్నాడనే ప్రచారమూ ఉంది. అందువల్లే జూనియర్ బాలయ్య కేంద్రంగా జరుగుతున్న ఫంక్షన్స్ కు దూరంగా ఉంటున్నాడు అంటున్నారు. ఏదేమైనా హైదరాబాద్ ఫంక్షన్ కు కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు.

, , , , , , ,