జీవిత రాజశేఖర్ కు జైలు

జీవిత రాజశేఖర్ అనే జంట పదం ఒకే పేరుగా ఎప్పుడో మారిపోయింది. ఆ జంటకు తాజాగా నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ కోర్ట్ జైలు శిక్ష విధించింది. వీరికి యేడాది జైలు శిక్షతో పాటు 5వేలు జరిమానా కూడా విధించింది.

కొన్నాళ్ల క్రితం జీవిత, రాజశేఖర్ చాలా అగ్రెసివ్ గా ఉండేవారని అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ ఇప్పటికీ ఉన్నారనుకోండి. అయితే 2011లో మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తోన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై ఈ జంట అనుచిత వ్యాఖ్యలు చేసింది. అక్కడ ఉచితంగా బ్లడ్ తీసుకుని బయట డబ్బులకు అమ్ముతున్నారని వీరు ఆరోపించారు.

దీంతో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ వీరిపై పరువు నష్టం దావా వేశాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ అప్పట్లో చిరంజీవి కూడా బాధపడ్డారు. అయితే ఈ కేస్ చాలాకాలం పాటు విచారణ జరిగింది.

ఇన్నేళ్ల తర్వాత ఫైనల్ గా జీవిత, రాజశేఖర్ కు ఏడాది జైలు శిక్షతో పాటు ఐదు వేలు జరిమానా విధించారు. అయితే వెంటనే వీరికి బెయిల్ మంజూరయింది.ఏదేమైనా ఈ తరహా వ్యవహారాలు వీరికి కొత్త కాదు. కొన్నాళ్ల క్రితం కూడా చెక్ బౌన్స్ కేస్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోసారి ఓ నిర్మాతను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి ఇకనైనా ఈ భార్య భర్తలు కామ్ గా తమ పని తాము చేసుకుంటే బెటరేమో

Related Posts