Tovino thomos : ఇమేజ్ ను పెంచుకోవడమంటే ఇది కదా..?

ఏ ఇండస్ట్రీలో అయినా ఏ హీరో అయినా.. ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్న పరిశ్రమల నుంచి వస్తూ.. ప్యాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కూడా అంత సులభం కాదు. ఈ విషయంలో మళయాల హీరో టోవినో థామస్ ను మెచ్చుకోవల్సిందే.

చాలా చిన్న సినిమాలతో మళయాలంలోనటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మెల్లగా తనకంటూ ఓస్టార్డమ్ తెచ్చుకున్నాడు. కథా బలం ఉన్న చిత్రాలకు ఎక్కువగా ఓటు వేసే టోవినో మళయాలంలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ ఇమేజ్ అనుకోకుండా అతన్ని ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేసింది. ఆ సినిమా పేరు మిన్నల్ మురళి.

ఈ చిత్రంలో ఇండియన్ సూపర్ మేన్ తరహా పాత్రలో నటించాడు టోవినో. తనతో పాటు ఓ విలన్ కూడా ఉంటాడు. సింపుల్ గా చెబితే సూపర్ మేన్, స్పైడర్ మేన్, బ్యాట్ మేన్ చిత్రాల ఇండియన్ వెర్షన్ లా ఉంటుందీ మూవీ. పైగా మళయాల నేటివిటీ కూడా కలిసి రావడంతో అక్కడ బిగ్గెస్ట్ హిట్ అయితే ఇతర భాషల్లో బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు 2018 మూవీతో మిన్నల్ మురలితో వచ్చిన ఇమేజ్ ను పెంచుకుంటున్నాడు. అఫ్ కోర్స్ ఈ మూవీలో అతను మాత్రమే హీరోకాదు. కానీ ఎక్కువ మందికి తెలిసిన ఫేస్ అతనిదే కావడంతో ప్రమోషన్స్ లో కూడా టోవినో థామస్ ను కీలకంగా వాడుతున్నారు.


ఇక ఈ మూవీ తర్వాత అతను “ఏఆర్ఎమ్” అనే మరో ప్యాన్ ఇండియన్ సినిమాతో రాబోతున్నాడు. దీనికి అజయంతే రందమ్ మోషనమ్ అని అర్థం. తెలుగులో దీన్ని అజయ్ రెండో దొంగతనం అని చెప్పొచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. స్టన్నింగ్ విజువల్స్ తో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలూ కనిపిస్తున్నాయి.

ఈ మూవీలో టోవినో థామస్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తన చేతిలో ఉన్న ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. మొత్తంగా పెరుగుతున్న ఇమేజ్ కు తగ్గట్టుగా మార్కెట్ ను కూడా పెంచుకుంటూ తన స్పాన్ ను దేశవ్యాప్తం చేసుకుంటోన్న టోవినో థామస్ ప్లానింగ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related Posts