HomeMoviesటాలీవుడ్పవన్ ఫంక్షన్ లో వాళ్లు లేని లోటు కనిపించిందా..

పవన్ ఫంక్షన్ లో వాళ్లు లేని లోటు కనిపించిందా..

-

పవన్ కళ్యాణ్‌ సినిమా ఫంక్షన్ అంటే ఖచ్చితంగా ఉండే పర్సన్ త్రివిక్రమ్ శ్రీనివాస్. చాలాకాలంగా వీళ్లు జంట పదాలయ్యారు అనేది నిజం. పవన్ రావాలంటే త్రివిక్రమ్ కూడా ఉండాల్సిందే అన్నట్టుగా మారింది సిట్యుయేషన్. బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ వస్తున్నాడు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఎందుకో ఆయన చివరి నిమిషంలో తప్పుకున్నాడు.

Trivikram 2

మామూలుగా ఏ వేదిక అయినా త్రివిక్రమ్ మాటల ప్రవాహం విజిల్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఆయన చెప్పే మాటల్లో కొన్ని జీవిత సత్యాలు వెదుక్కుంటారు అభిమానులు. ఇక పవన్ కళ్యాణ్‌ గురించి అయితే మరో రేంజ్ లో చెబుతాడు. బట్ ఈ సారి బ్రో మూవీ ఫంక్షన్ లో త్రివిక్రమ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. పైగా ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించాడు. అయినా ఎందుకు రాలేదో కానీ.. ఫ్యాన్స్ ఆ లోటును ఫీలయ్యారు.

Pic 4


ఇక పవన్ సినిమా ఫంక్షన్ అంటే త్రివిక్రమ్ తో పాటు కనిపించే మరో పేరు బండ్ల గణేష్. పరమేశ్వరా, పవనేశ్వరా అంటూ ఆ మధ్య స్టేజ్ మొత్తం షేక్ చేశాడు గణేష్‌. మామూలుగా తనకు తాను పవన్ కళ్యాణ్‌ కు భక్తుడుగాచెప్పుకుంటాడు బండ్ల గణేష్. అందుకే ఏ సినిమా ఫంక్షన్ అయినా అతను రావాల్సిందే.

Pic 1 2

అభిమానులను తనదైన మాటల మాయాజాలంలో ముంచేయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇంతకు ముందు భీమ్లా నాయక్ సినిమా ఫంక్షన్ కు బండ్ల గణేష్ ను పిలిస్తే తన రేషియో తగ్గుతుందని త్రివిక్రమ్ వద్దని చెప్పాడు అంటూ ఓ ఫేక్ వీడియో సర్కిలేట్ అయింది. అది నిజమా కాదా అనేది ఎవరూ పట్టించుకోలేదు.

Bandla Ganesh Sensational Comments On Trivikram Srinivas Jpg

కొందరు నిజమే అనుకున్నారు.అప్పటి నుంచి త్రివిక్రమ్ తో కాస్త డిఫరెన్సెస్ వచ్చాయి గణేష్‌ కు. అప్పుడప్పుడూ ట్విట్టర్ లో కూడా ఈ మేటర్ పెడుతుంటాడు. మొత్తంగా అతనికీ బ్రో సినిమా ఫంక్షన్ కు ఆహ్వానం లేదు. ఇలా ఇద్దరూ ఒకేసారి మిస్ అయ్యేసరికి స్టేజ్ మొత్తం కాస్త బొసిపోయినట్టుగా అనిపించింది. పైగా వచ్చిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ఏమీ మాట్లాడలేదు. సాయితేజ్ సంగతి సరే సరి. కేవలం పవన్ స్పీచ్ మాత్రమే హైలెట్ గా కనిపించింది.

ఇవీ చదవండి

English News