ఆసక్తికరంగా ‘బృందా’ వెబ్ సిరీస్ టీజర్

చెన్నై సోయగం త్రిష ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉంది. ఒకవైపు చిరంజీవితో ‘విశ్వంభర’, కమల్ హాసన్ తో ‘థగ్ లైప్’, అజిత్ తో ‘విదా ముయార్చి’, మోహన్ లాల్ తో ‘రామ్’ వంటి సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ దుమ్మురేపుతోంది. త్రిష లీడ్ రోల్ లో రాబోతున్న వెబ్ సిరీస్ ‘బృందా’. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను కొల్లా ఆశిష్ నిర్మిస్తున్నారు. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, ఆమని, రవీంద్ర విజయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ‘బృందా’ టీజర్ రిలీజయ్యింది.

‘మనలో ఉన్న కోపం, మోసం, ద్వేషం.. వీటితో కాదు మనం పోరాడాల్సింది. మనలో ఉన్న మంచితో.. అది మన నుంచి పోకుండా..’, ‘ఈ ప్రపంచంలోకి మనం రాక ముందు ఎంత చెడైనా ఉండొచ్చు.. కానీ.. వెళ్లే ముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్లడం మనం బాధ్యత’ అంటూ సాగే డైలాగ్స్ తో ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఆగస్టు 2 నుంచి సోనీ లివ్ లో ‘బృందా’ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.

Related Posts