యాభై యేళ్ల వయసులో ట్రూ లవ్ దొరికితే.. మళ్లీ పెళ్లి

సీనియర్ నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల ప్రేమ వ్యవహారమే కాదు.. పెళ్లివిషయం కూడా టాలీవుడ్(Tollywood) తో పాటు శాండల్ వుడ్ హాట్ టాపిక్ అయింది. ఆల్రెడీ పెళ్లైన పవిత్ర, అప్పటికేరెండు పెళ్లిల్లైన నరేష్‌ మధ్య ప్రేమేంటీ.. వీరిది కేవలం లస్ట్ లేదా డబ్బు కోసం పుట్టిన ఫేక్ లవ్ అనే సెటైర్స్ కూడా పడ్డాయి. బట్ ఆ ఇద్దరూ దాన్ని ఒప్పుకునేందుకు ఇష్టపడలేదు. అందుకే తమది నిజమైన ప్రేమే అని జనానికి ప్రూవ్ చేసేందుకే ఏకంగా తన ప్రేమకథను సొంత డబ్బులతో సినిమాగానే తీస్తున్నాం అని ప్రకటించారు.

దీనికి నిర్మాత నుంచి దర్శకుడుగా మారిన ఎమ్మెస్ రాజును కెప్టెన్ గా తీసుకున్నారు. కథ, కథనం అంతా నరేష్‌- పవిత్ర రియల్ లైఫ్‌ ఇన్సిడెంట్సే. సో ఎమ్మెస్ రాజు(MS Raju)కు దీన్ని హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమే కాలేదు అని లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.


మళ్లీ పెళ్లి మూవీ ట్రైలర్ ను గ్రాండ్ గానే రిలీజ్ చేశాడు నరేష్‌. ట్రైలర్ ను బట్టి చూస్తే.. నరేష్ తన రెండో భార్యతో ఇబ్బందులు పడుతున్నాడు. అటు పవిత్ర మాత్రం హ్యాపీగానే ఉంది. అయినా తాము చేస్తోన్న సినిమాలను బట్టి సెట్స్ లోనే నరేష్ కు పవిత్ర అంటే ప్రేమ కలుగుతుంది. అందుకు పవిత్ర సిద్ధంగా లేకపోయినా.. కొన్ని పరిస్థితులు.. నరేష్‌ సన్సియర్ లవ్ చూసిన తర్వాత తనూ ప్రేమలో పడుతుంది. కానీ వీరి బంధాన్ని సమాజం అనైతికంగా చూస్తుంది. అదే విషయం పవిత్ర నరేష్ ను నిలదీసి అడుగుతుంది. తమది అనైతిక బంధం కాదు. నిజమైన ప్రేమ అంటూ సమాజానికి చెప్పేందుకే తాము మళ్లీ పెళ్లి.. చేసుకున్నాం అనే అర్థం వచ్చేలా ట్రైలర్ కనిపిస్తోంది.

ఈ కథలో కొన్ని కామన్ ఆడియన్స్ కు కూడా తెలిసిన సంఘటనలు ఉన్నాయి. అవి ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నరేష్ ఈ కథను సిన్సియర్ గా చెప్పడానికే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఎక్కడా ఏ విషయాన్నీ దాచే ప్రయత్నం చేయలేదు. కాకపోతే రెండో భార్యనే ఒన్ సైడెడ్ గా విలన్ గా చేశారేమో అనిపిస్తోంది.


విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ(Krishna)తో పాటు విజయనిర్మల పాత్రలూ ఉన్నాయి. ఆ పాత్రల్లో సీనియర్ నటులు శరత్ బాబు, జయసుధ నటించారు. పైగా మహేష్‌ బాబు(Mahesh Babu)తో పాటు ఆయన తల్లి ఇందిర ప్రస్తావన కూడా కనిపిస్తోంది. మొత్తంగా మళ్లీ పెళ్లి చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరి వీరి పెళ్లి వ్యవహారం వెండితెరపై ఎలాంటి ఫలితాన్ని చూస్తుందో చూడాలి.

Related Posts