Producers : విజయ్ దేవరకొండతో సినిమా చేస్తే ఊరుకోం

విజయ్ దేవరకొండతో సినిమా చేస్తే ఊరుకోం అంటున్నారు దర్శకుడి బాధిత నిర్మాతలు. మరి ఆ దర్శకుడు ఎవరో ఊహించారు కదా..? యస్ పరశురామ్. తెలుగు సినిమా పరిశ్రమలో పరశురామ్ ఇప్పుడు హాట్ టాపిక్. అందరి దగ్గర అడ్వాన్స్ లు తీసుకున్నాడు. వారికి తప్ప మిగతా వారికి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చిన్న వారి నుంచి పెద్ద నిర్మాతల వరకూ పరశురామ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ లు ఇస్తున్నారు.

గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ హాట్ కేక్ అయ్యాడు. దీంతో చాలామంది అడ్వాన్స్ లు ఇచ్చారు. 14 రీల్స్, అల్లు అరవింద్, డివివి దానయ్య.. ఇలా టాప్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. 14 రీల్స్ లో నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉండగా.. అదే టైమ్ లో మహేష్‌ బాబుతో ఆఫర్ వచ్చిందని అటు వెళ్లి సర్కారువారి పాట చేశాడు.

ఈ విషయంలో నాగ చైతన్య అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక దానయ్య లేదా అల్లు అరవింద్ తో అయినా చేస్తాడు అనుకుంటే సడెన్ గా దిల్ రాజు వద్దకు వెళ్లి విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేశాడు. ఇది ఈ నిర్మాతలకు ఇంకా కోపం తెప్పించింది. ఆ మధ్య అల్లు అరవింద్ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఈ చిత్రాన్ని ఆపాలనుకున్నాడు. కానీ ఇష్యూను ఆపి ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో పెట్టారు. ఈ వ్యవహారం ఇప్పుడు గిల్డ్ లోఉంది.

అయితే ఇక పరశురామ్ ను వదిలేది లేదని ఈ నిర్మాతలు నిర్ణయించుకున్నారు. చేస్తే ముందు అడ్వాన్స్ తీసుకున్న మాకు సినిమా చేయాలి. లేదంటే ఇచ్చిన అడ్వాన్స్ ను వడ్డీతో సహా చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండతో పరశురామ్ సినిమా చేస్తే వీరికి వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలి. లేదంటే విజయ్ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. అలా జరిగితే దిల్ రాజూ ఊరుకోడు. సో.. ఇప్పుడు పరశురామ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.


ఏదేమైనా ఇదంతా పరశురామ్ స్వయంకృతాపరాథం అని అందరికీ తెలుసు. అడ్వాన్స్ లు తీసుకోవడం అంటే ఒక బాధ్యత తీసుకోవడం అన్న విషయాన్ని మరవడమే కాక.. నైతికతను కూడా వదులుకుని వేరే వారికి సినిమాలు చేయడానికి ఒప్పుకోవడాన్ని ఈ సీనియర్ ప్రొడ్యూసర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అదీ మేటర్.

Related Posts