నటుడు అనే వాడు ప్రతీ రసాన్ని అద్భుతంగా పండించ గలగాలి. అయితే.. మన టాలీవుడ్ లో కొంతమంది కథానాయకులు కొన్ని రసాల్నే ఎక్కువగా ఔపోసాన పడుతుంటారు. మిగతా వాటి జోలికి ఎక్కువగా వెళ్లరు. అలా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పటివరకూ ఫుల్ లెన్త్ కామెడీ జోలికి ఎక్కువగా వెళ్లలేదు.
మెగాస్టార్ చిరంజీవి.. ఒకవైపు అగ్రెస్సివ్ రోల్స్ లో అదరగొడుతూనే.. ‘చంటబ్బాయ్’ వంటి ఫుల్ లెన్త్ కామెడీ రోల్స్ చేసిన సందర్భాలున్నాయి. అలాగే.. తన సినిమాల్లో హీరోయిజాన్ని ఏ రేంజులో చూపిస్తాడో.. కామెడీని అదే స్థాయిలో పండించడం చిరంజీవి సహజ శైలి. ఇప్పుడు చరణ్ కూడా అప్ కమింగ్ మూవీలో కామెడీని సైతం పండించడానికి రెడీ అవుతున్నాడట.
బుచ్చిబాబుతో చేయబోయే సినిమాలో తనలోని కామెడీ యాంగిల్ ను కూడా బయటకు తీయబోతున్నాడట రామ్ చరణ్. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ మూవీ ఆద్యంతం ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమాకోసం ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి చాలామంది నటీనటులను ఎంపిక చేసుకున్నారు. అక్కడ ప్రాంతంలో నుంచి సహజసిద్ధంగా ఉండే హాస్యాన్నే ఈ సినిమాలో చూపించనున్నారట. చరణ్ రోల్ కూడా చాలా సహజంగా ఉంటూ ఈ మూవీలో హాస్యాన్ని పంచనుందట.
మొత్తంగా.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రూరల్ రస్టిక్ మూవీలో రామ్ చరణ్ మేకోవర్ ఎంతో సరికొత్తగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆర్.సి.16’ ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకుంది. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటించబోతుంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.