హౌస్ హ‌జ్బెండ్` టీజ‌ర్ లాంచ్‌!!

శ్రీక‌ర‌ణ్‌ ప్రొడ‌క్ష‌న్స్, ల‌య‌న్ టీమ్ క్రెడిట్స్ బేన‌ర్స్ పై శ్రీక‌ర్‌, అపూర్వ‌ జంట‌గా హ‌రికృష్ణ జినుక‌ల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం `హౌస్ హ‌జ్బెండ్‌`. ఈ చిత్రం టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టియ‌ఫ్‌సిసి చైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ , ప్ర‌ముఖ నిర్మాత రామ‌ స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయి వెంక‌ట్‌, వైయ‌స్ ఆర్ టి పీ రాష్ట్ర కార్యదర్శి మ‌ల్లిఖార్జున్ , స‌మైక్య ఆంధ్ర స‌మితి జాతీయ అధ్య‌క్షుడు గొంటి కుమార్ చౌద‌రి, న‌టి క‌రాటే క‌ళ్యాణి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇదే కార్య‌క్ర‌మంలో ప్రొడ‌క్ష‌న్ హౌస్ తర‌పున నుంచి ఐఏయ‌స్ స్ట‌డీ కోసం ఒక విద్యార్థినికి చెక్ అంద‌జేశారు.

అనంత‌రం హీరో శ్రీక‌ర్ మాట్లాడుతూ…“ఇదొక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రం. ఒక హౌస్ హ‌జ్బెంబ్ కావాలి అనుకున్న అమ్మాయికి ఎలా సిట్యుయేష‌న్స్ ఎదుర‌య్యాయి అన్న‌ది సినిమా. ద‌ర్శ‌కుడు ఎంతో డెడికేష‌న్ తో సినిమా చేశారు. ఒక షెడ్యూల్ విజ‌య‌వంతంగా పూర్తి చేశాం. త్వ‌ర‌లో మిగ‌తా షూటింగ్ పూర్తి చేస్తాం“ అన్నారు. హీరోయిన్ అపూర్వ రాయ్ మాట్లాడుతూ…“ఇది నా తొలి చిత్రం. స్టోరి చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. ఇందులో నేను సాప్ట్ వేర్ ఉద్యోగినిగా న‌టించాను“ అన్నారు. హీరోయిన్ అపూర్వ రాయ్ మాట్లాడుతూ…“ఇది నా తొలి చిత్రం. స్టోరి చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. ఇందులో నేను సాప్ట్ వేర్ ఉద్యోగినిగా న‌టించాను“ అన్నారు.

రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ…“ ఈ ద‌ర్శ‌కుడు గ‌తంలో ల‌వ్ ఎటాక్ చేశాడు . అది స‌క్సెస్ అయింది. ఈ సినిమా కూడా స‌క్సెస్ కావాల‌న్నారు. టియ‌ఫ్‌సిసి చైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“సినిమా మీద ఎంతో ఆస‌క్తితో శ్రీక‌ర్ పరిశ్ర‌మ‌కు వ‌చ్చాడు. ఈ సినిమాతో హీరోగా స‌క్సెస్ కావాలి. టీజ‌ర్ చూశాక ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌న్నారు. ల‌య‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ..“టీజ‌ర్ చాలా బావుంది. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.

గిరిబాబు, భానుచంద‌ర్, సుమ‌న్‌, ర‌ఘుబాబు, క‌రాటే క‌ళ్యాణి, బోసుబాబు, క‌రుణాక‌ర్‌, అశోక్ రాజ్, బాబురావు, క‌న‌క‌రాజు త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి డిఓపిః రాజు, సంగీతంః ద‌త్తు, ఎడిట‌ర్ః సంప‌త్‌, ఆర్ట్ డైర‌క్ట‌ర్ః న‌రేష్‌, పీఆర్వోః ర‌మేష్ చందు, స్టంట్స్ః అశోక్ రాజ్‌, లిరిక్స్ః నాగ‌రాజు కువ్వారపు, స‌త్య‌నారాయ‌ణ‌, స‌రిత న‌రేష్‌, కొరియోగ్ర‌ఫీః శ్రీధ‌న్‌, వి.నందు జెన్న‌, ప‌బ్లిసిటీ డిజైన‌ర్ః మ‌నీష్‌,

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం-నిర్మాతఃహ‌రికృష్ణ‌.

Related Posts