విజయ్ సినిమాలకు హీరోయిన్స్ సెట్..!

రౌడీ స్టార్ విజయ్ ఇప్పుడు వరుసగా మూడు సినిమాలతో బిజీ అయ్యాడు. వీటిలో ఒకటి గౌతమ్ తిన్ననూరితో కాగా.. మరో రెండు సినిమాలకు రవికిరణ్ కోలా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక.. గౌతమ్ తిన్ననూరితో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో మొదట శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకుంది. ఆ స్థానంలో ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు, ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపించాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు విజయ్ తో జోడీ కట్టనున్నారు.

దిల్‌రాజు నిర్మాణంలో ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో విజయ్ కి జోడీగా సాయిపల్లవిని నాయికగా పరిశీలిస్తున్నారట. క్యారెక్టర్ నచ్చితేనే సినిమా చేయడానికి ఇష్టపడే సాయిపల్లవి.. ఈ మూవీలో తన పాత్ర బాగా నచ్చడంతో విజయ్ తో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక.. ‘ఫిదా, ఎమ్.సి.ఎ’ తర్వాత దిల్‌రాజు బ్యానర్ లో సాయిపల్లవి నటించే సినిమా ఇదే కాబోతుంది. మరోవైపు.. విజయ్ కి జోడీగా సాయిపల్లవి నటించడం ఇదే తొలిసారి.

‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యాన్ కాంబోలో మరో సినిమా రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం 1854 నుంచి 1878 మధ్య జరిగే కథగా తెరకెక్కనుంది. ఈ మూవీలో విజయ్ కి జోడీగా రష్మిక నటించనుందట. ఇప్పటికే ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాలలో నటించిన ఈ జంట.. ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి జోడీ కట్టనుంది.

Related Posts