హీరోయిన్లు రారు.. హీరోలకు తప్పదు..

టాలీవుడ్ లో కుర్ర హీరోల కష్టాలు చెప్పతరం కాకుండా మారాయి.ఎవరైనా సినిమా గురించి చెబితే.. హీరో హీరోయిన్ ఎవరూ అని వెంటనే అడుగుతారు. ఆ ఇద్దరూ సినిమాకు ఎంత కీలకమో వేరే చెప్పక్కర్లేదు కూడా. సినిమాకే కాదు. ప్రమోషన్స్ కు కూడా అంతే కీలకం కదా.. బట్.. తెలుగులో ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోలకు హీరోయిన్లతో కష్టాలు మొదలయ్యాయి. ఒకరేమో ప్రమోషన్స్ కు రాలేని పరిస్థితిలో ఉన్నారు. మరొకరు ఎందుకు రావడం లేదో ఎవరూ చెప్పరు. దీంతో భారం తమ మీదే వేసుకుని ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారీ హీరోలు.ఆ హీరోలు ఎవరో ఇంకా చెప్పాలా.. యస్.. విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి. వీరికి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. అక్కడి నుంచి ప్రమోషనల్ సపోర్ట్ ఏదైనా రావడానికి.


విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. మామూలుగా ప్రమోషన్స్ అంటే సమంత ఎప్పుడూ ముందే ఉంటుంది. కానీ ఇప్పుడు తన ఆరోగ్యం బాగాలేదు. అయినా ఆ మధ్య ఒక ఈవెంట్ చేసింది. కొన్ని కామన్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది.అయితే ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ లో చెన్నై, ముంబై వంటి సిటీస్ లో తను ఉంటే చాలా హెల్ప్ అయ్యేది. బట్ తను రాలేని పరిస్థితిలో ఉంది. అందుకే విజయ్ దేవరకొండ సోలోగానే ప్రమోషన్స్ చేస్తున్నాడు. వరుసగా ఇండియాలోని ప్రధాన నగరాలన్నీ తిరుగుతూ తనదైన శైలిలో అక్కడి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ.. తన సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు.


ఇక అనుష్కశెట్టి, నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది. సినిమా ట్రైలర్ తర్వాత మంచి అంచనాలు వచ్చాయి. బట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనుష్క మిస్ అయింది. తను లేని లోటు స్పష్టంగా కనిపించింది. బాహుబలి, భాగమతి తర్వాత తను చేసిన ఓటిటి మూవీ నిశ్శబ్దం ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

అంతకు ముందే తను బాగా లావుగా మారింది. అందుకే ఆడియన్స్ ముందుకు రావడం లేదు అంటారు. ఈ సినిమా కథ నచ్చడం వల్లే చేసిందట. కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేదు అంటున్నారు. ట్రైలర్ గురించి కనీసం ఒక వీడియో బైట్ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో ఈ మూవీ ప్రమోషనల్ బాధ్యతలు కూడా నవీన్ పైనే పడతాయి. విశేషం ఏంటంటే.. ఈ మూవీ కూడా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే వస్తోంది. సో.. నవీన్ కూడా సోలోగానే కంట్రీ మొత్తం చుట్టేస్తూ ప్రమోషన్స్ చేసుకోవాలింక. మొత్తం కుర్ర హీరోలకు ప్రమోషనల్ కష్టాలు బాగా ఉన్నాయి.

Related Posts