విలక్షణమైన నటనతో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ  వినోదాత్మక చిత్రాలు అందించడంలో హీరో కార్తి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 2022 వరుస విజయాలతో కార్తికి బ్లాక్ బస్టర్ ఇయర్ గా నిలిచింది. వరుసగా మూడు సూపర్‌ హిట్‌ లను అందుకున్నారుసగుని’,’కాష్మోరా’,’తీరన్ అధిగారమ్ ఒండ్రు’,’ఖైదీ’,’సుల్తాన్’ వంటి 5 సూపర్‌హిట్ చిత్రాల తర్వాత హీరో కార్తి 6వ సారి ప్రతిష్టాత్మక చిత్రం ‘జపాన్’ కోసం డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ మరోసారి జతకలిశారు. వినోదంతో పాటు సామాజిక విలువలతో చిత్రాలు అందించే రాజు మురుగన్ ‘జపాన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు- డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్, రాజు మురుగన్ కాంబినేషన్ లో వచ్చిన ‘జోకర్’ జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ కార్తి ‘జపాన్’ కోసం రాబోతుంది. కార్తికి ఇది 25వ సినిమా కావడం మరింత విశేషం. 

ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్‌ జోడి కడుతోంది. అల్లు అర్జున్ ‘పుష్ప’లో ‘మంగళం శీను’ పాత్రలో ఆకట్టుకున్న సునీల్ ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం.తమిళ చిత్ర పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్‌ గా 25 ఏళ్ల అనుభవంతో పాటు ‘కోలి సోడా’,’కడుగు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను నిరూపించుకున్న విజయ్ మిల్టన్ ‘జపాన్’ చిత్రంతో తొలిసారిగా నటిస్తున్నారు.బెస్ట్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ గా 2020 నేషనల్ అవార్డ్ గెలుచుకున్న జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు.

మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా,  నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.’జపాన్’ పూజా కార్యక్రమాలు మంగళవారం (8.11.2022) ఉదయం గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌ బెస్ట్ విశేష్ అందించారు. త్వరలోనే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. రాజుమురుగన్ – కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న జపాన్ ప్రేక్షకుల్లో  భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.’జపాన్’ అభిమానుల అంచనాలను మించేలా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ‘జపాన్’ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.