ఎంత పెద్ద స్టార్ అయినా హెల్త్ ఇష్యూస్ వస్తే తప్పకుండా తలొంచాల్సిందే. కొన్నాళ్ల వరకూ వాయిదా వేయొచ్చు. కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఎవరికైనా అసలుకే ప్రమాదం. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్స్ హెల్త్ ఇష్యూస్ తోఇబ్బంది పడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నిన్ననే నీ సర్జరీ(మోకాలి ఆపరేషన్) చేయించుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు చిరంజీవి.అంతకు ముందే యేడాది కాలంగా ఇబ్బంది పడుతోంది సమంత. మయోసైటిస్ వ్యాధిబారిన పడిన సమంత యేడాది కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది. బట్ ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకోలేదు.
ఇలాగే నిర్లక్ష్యం చేస్తే తన కెరీర్ కే కాదు.. జీవితానికే ప్రమాదం. అందుకే ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ సంవత్సరంలో ఈ వ్యాధికి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్న అన్ని చోట్లకూ వెళ్లి పూర్తిగా కోలుకుని రావాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు కొత్తగా ఏ సినిమాలూ ఒప్పుకోలేదు. ఒప్పుకున్న సినిమాల అడ్వాన్స్ లు కూడా వెనక్కి ఇచ్చేసింది.
ఇక ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. ప్రభాస్ కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఆ మధ్య యూఎస్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు అన్నారు కానీ కేవలం పై పై చికిత్స మాత్రమే చేయించుకున్నాడు. త్వరలోనే అతను మోకాలికి ఆపరేషన్ చేయించుకోబోతున్నాడు. చిరంజీవిలా కాకుండా ఇది కాస్త పెద్ద ఆపరేషనే అంటున్నారు. ఈ సర్జరీ తర్వాత దాదాపు నెలన్నరకు పైగా రెస్ట్ అవసరం అని చెప్పారట. మరి అన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే కమిట్ అయిన సినిమాల ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడతారని ముందు ఇవి పూర్తి చేస్తున్నాడు.
అన్నీ ఓ కొలిక్కి రాగానే ప్రభాస్ తన మోకాలు సర్జరీకి వెళతాడు. మొత్తంగా టాలీవుడ్ కు ట్రీట్మెంట్ కాలం నడుస్తోందిప్పుడు. మరి వీరితో ఇంకా ఎంతమంది ఉన్నారో కానీ.. డ్యాన్స్ లు, ఫైట్స్ చేయడం వల్ల మన స్టార్స్ కాదే సినిమా స్టార్స్ అంతా ఎప్పుడో అప్పుడు మోకాలి సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నారు.