బాలీవుడ్ కు ఎన్నాళ్లో వేచిన రిజల్ట్ వచ్చింది. అంతా ఊహించినట్టుగానే ఓ బ్లాక్ బస్టర్ పడింది. అయితే ఇది కూడా సౌత్ సినిమా రీమేక్ కావడం విశేషం. పైగా దర్శకులు కూడా ఇక్కడి వారే. సో.. ఈ విషయంపై అక్కడి కొందరు విమర్శలు చేస్తున్నా.. విజయం మాత్రం వచ్చింది కదా అని మేకర్స్ తో పాటు బాలీవుడ్ కూడా హ్యాపీగా ఫీలవుతోంది. మరి నార్త్ వారి మొహంలో ఆనందం నింపిన ఆ సినిమా ఏంటా అని ఆలోచిస్తున్నారా..? విక్రమ్ వేద.విక్రమ్ వేద.. తమిళ్ లో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన సినిమా. గ్యాంగ్ స్టర్, ఓ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ మధ్య సాగే ఈ డ్రామా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. తమిళ్ లో అనూహ్యంగా చాలా పెద్ద విజయం సాధించింది. పుష్కర్ – గాయత్రి ద్వయం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అప్పట్లో తెలుగులోనూ ఈ మూవీని రీమేక్ చేస్తారనీ..

ఫలానా హీరోలు నటిస్తారనే రూమర్స్ హల్చల్ చేశాయి. కానీ ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. కొన్నాళ్లుగా సౌత్ సినిమాల విజయాలను చూస్తూ తెగ ఇదైపోతోన్న బాలీవుడ్ కు విక్రమ్ వేద బాగా కలిసొచ్చింది. ఒరిజినల్ దర్శకులే రూపొందించిన ఈ మూవీలో అక్కడ హృతిక్ రోషన్- సైఫ్ అలీఖాన్ నటించారు. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.రీమేక్ లోనూ ఇంటెన్సిటీ, ఎమోషన్స్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నారు దర్శకులు. బడ్జెట్ పరంగా కాస్త ఎక్కువ ఫ్రీడమ్ రావడంతో మేకింగ్ పరంగా మరింత మెప్పించారు. అటు ఆ పాత్రల్లో హిందీ హీరోలిద్దరూ అద్భుతంగా ఒదిగిపోయారు. రీమేక్ అయినా వాళ్లు కూడా ఒరిజినల్ మూవీలాగే కష్టపడ్డారు. దీంతో ఆడియన్స్ తో పాటు క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి టెరిఫిక్ అనే ట్యాగ్స్ పడుతున్నాయి. నిజానికి ఈ ఇద్దరు హీరోలకు సాలిడ్ హిట్ పడి చాలాకాలమైంది. ఇలా ఒకరు నెగెటివ్ రోల్ చేసినా ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ తో ఒకేసారి ఇద్దరికీ ఈ మూవీ బూస్ట్ ఇచ్చినట్టైంది. మరి ఈ విజయం మరింత పెరుగుతుందా లేదా అనేది చూడాలి.