HomeMoviesటాలీవుడ్జోరుగా ప్రచారాన్ని మొదలుపెట్టనున్న 'గేమ్ ఛేంజర్'

జోరుగా ప్రచారాన్ని మొదలుపెట్టనున్న ‘గేమ్ ఛేంజర్’

-

‘ఇండియన్ 2’ విడుదలపై స్పష్టత రావడంతో ఇకపై శంకర్ తన పూర్తిస్థాయి దృష్టిని ‘గేమ్ ఛేంజర్’పైనే పెట్టనున్నాడు. ఈనేపథ్యంలో.. ఈనెల చివరి నుంచే ‘గేమ్ ఛేంజర్’ ప్రచారంలో స్పీడు పెంచాలని భావిస్తున్నాడట నిర్మాత దిల్‌రాజు. వరుసగా ఒకటి తర్వాత ఒకటిగా పాటలను విడుదల చేసి.. స్పెషల్ గ్లింప్సెస్ ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ఒకవైపు షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసి.. మరోవైపు సైమల్టేనియస్ గా ప్రమోషన్స్ నిర్వహించాలనుకుంటున్నారట. ఈకోవలోనే ‘గేమ్ ఛేంజర్’ను సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట ప్రొడ్యూసర్ దిల్‌రాజు.

ఇప్పటికే ‘గేమ్‌ ఛేంజర్’ నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్, ‘జరగండి జరగండి’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. కియారా అద్వానీ, అంజలి నాయికలుగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, నవీన్ చంద్ర వంటి వారు కనిపించనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఇవీ చదవండి

English News