HomeMoviesటాలీవుడ్ట్రైన్ ఫైట్ తో 'గేమ్ ఛేంజర్' టీజర్!

ట్రైన్ ఫైట్ తో ‘గేమ్ ఛేంజర్’ టీజర్!

-

‘గేమ్ ఛేంజర్’ నుంచి రెండు పాటలు బయటకు వచ్చాయి. అయితే.. అసలు సిసలు కంటెంట్ ఇక ముందు రాబోతుంది. ఇప్పటివరకూ ఈ సినిమా పబ్లిసిటీని లైట్ తీసుకున్న టీమ్.. ఇకపై స్పీడు పెంచబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని హోరెత్తించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

అందులో భాగంగా మొదటగా వచ్చేది టీజర్. నవంబర్ 9న ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించింది టీమ్. టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుంగీ కట్టుకొని పట్టాల మీద కూర్చున్నాడు. తన ముందు కొంతమంది విలన్ మనుషులను పట్టాల మీద పడుకోపెట్టాడు. వెనకాల ట్రైన్ వస్తున్నట్టు ఉంది. ఈ మాస్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్రైన్ ఫైట్ సినిమాలో హైలైట్ గా ఉండబోతుందని తన ట్వీట్ లో హింట్ ఇచ్చాడు మ్యూజికల్ సెన్సేషన్ తమన్.

రామ్ చరణ్ అంటేనే యాక్షన్ ను ఓ రేంజులో ఇరగదీస్తాడు. అతనికి శంకర్ వంటి భారీ చిత్రాల దర్శకుడు దొరికితే.. ఆ యాక్షన్ రేంజు మరెన్నో రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లోనూ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా వచ్చాయనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతుంది. మొత్తంగా.. ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ఎలాంటి విజువల్ ఫీస్ట్ అందిస్తుందో చూడాలి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు ముస్తాబవుతుంది.

ఇవీ చదవండి

English News