ప్రభాస్ కి హిట్ పడాలంటే రాజమౌళి ఉండాల్సిందే!

తన మనసుకి నచ్చిన వారి కోసం ఎలాంటి సహాయం చేయడానికైనా వెనుకాడడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక.. డార్లింగ్ ప్రభాస్ విషయంలో అయితే రాజమౌళి ఏం చేయడానికైనా సిద్ధమవుతుంటాడు. ‘ఛత్రపతి’తో మొదలైన వీరి బంధం.. ఆ తర్వాత ‘బాహుబలి’ సిరీస్ వరకూ కొనసాగింది. అయితే.. ‘బాహుబలి’ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయకపోయినా.. ప్రభాస్ చేసే సినిమాల విషయంలో రాజమౌళి కంట్రిబ్యూషన్ ఉంటూ వస్తోంది.

‘సలార్’ కోసం రాజమౌళి పనిగట్టుకుని పబ్లిసిటీ చేశాడు. ‘సలార్’ సినిమా విడుదలకు ముందు ఎలాంటి వేడుకలు నిర్వహించలేదు. కేవలం.. రాజమౌళితో ఓ స్పెషల్ ఇంటర్యూ ప్లాన్ చేశారు. అది డార్లింగ్ ప్రభాస్ పై ఉన్న అభిమానంతో రాజమౌళి ఆ ఇంటర్యూ చేసినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. రాజమౌళి పరోక్షంగా సపోర్ట్ ఇచ్చిన ‘సలార్’ సూపర్ హిట్ అయ్యింది.

లేటెస్ట్ గా ‘కల్కి’ చిత్రంలోనూ రాజమౌళి కంట్రిబ్యూషన్ ఉంది. ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో మెరిసాడు జక్కన్న. చాలా ఫన్నీగా ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు నాగ్ అశ్విన్. సినిమాలో రాజమౌళి సీన్ రాగానే థియేటర్లలో అరుపులే అరుపులు. ఈ విధంగా ప్రభాస్ ‘కల్కి’ విజయంలోనూ రాజమౌళి భాగస్వామ్యమయ్యాడన్నమాట.

Related Posts