‘సరిపోదా శనివారం‘ ఆగమనానికి యాభై రోజులు

నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీ ‘సరిపోదా శనివారం‘. ‘దసరా, హాయ్ నాన్న‘ వంటి వరుస విజయాల తర్వాత నాని నుంచి వస్తోన్న మూవీ ఇది. ఇప్పటికే నాని తో ‘అంటే సుందరానికి‘ వంటి ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.

ఆగస్టు 29న విడుదలకు ముస్తాబవుతోన్న ‘సరిపోదా శనివారం‘ నుంచి వరుస అప్డేట్స్ అందిస్తూనే ఉంది నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్. లేటెస్ట్ గా.. ఈ సినిమా విడుదలకు ఇంకా కేవలం యాభై రోజులు మాత్రమే ఉందంటూ ఓ స్పెషల్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది.

Related Posts