HomeMoviesటాలీవుడ్మాస్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న ఫహాద్

మాస్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న ఫహాద్

-

ప్రతినాయకుడు ఎంత పవర్ ఫుల్ గా ఉంటే.. కథానాయకుడి పాత్ర అంతలా ఎలివేట్ అవుతోంది. అందుకే.. మన స్టార్స్ తమకు దీటైన విలన్స్ ను ఎంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక.. ‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్ కి అలాంటి పవర్ ఫుల్ విలన్ గా ఫహాద్ ఫాజిల్ ని సెట్ చేశాడు సుకుమార్.

‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ లో కాసేపే మురిపించినా.. రెండో పార్ట్ అంతా ఫహాద్ దే. ‘పుష్ప.. ది రూల్’లో అల్లు అర్జున్, ఫహాద్ మధ్య వచ్చే సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఉంది. ఇక.. ఈరోజు ఫహాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా.. తమ భన్వర్ సింగ్ షెకావత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫహాద్ కి సంబంధించి ఓ మాస్ పోస్టర్ వదిలారు ‘పుష్ప’ మేకర్స్.

ఇవీ చదవండి

English News