‘పుష్ప 2’ కోసం డేట్స్ కేటాయించిన ఫహాద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీ ‘పుష్ప 2’. ఇండిపెండెన్స్‌ డే స్పెషల్ గా ఆగస్టు 15న ఈ క్రేజీ సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో.. రెండు, మూడు యూనిట్స్ తో ‘పుష్ప2’ని జెట్ స్పీడులో కంప్లీట్ చేస్తున్నాడు క్రియేటివ్ జీనియస్ సుకుమార్. ఇక.. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీలో విలన్ పాత్రధారి ఫహాద్ ఫాజిల్ కి సంబంధించిన సన్నివేశాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయట.

మాలీవుడ్ యాక్టింగ్ పవర్ హౌజ్ ఫహాద్ ఫాజిల్.. ఎంతో బిజీయెస్ట్ ఆర్టిస్ట్. ఒకవైపు మలయాళంలో హీరోగా దుమ్మురేపుతూనే.. పరభాషల్లోనూ క్యారెక్టర్స్ తో అదరగొడుతుంటాడు. ‘పుష్ప 2’లో మెయిన్ విలన్ అయిన ఫహాద్.. జూన్ 1 నుంచి ఈ సినిమా షూట్ లో పాల్గొంటాడట. వరుసగా రెండు వారాల పాటు ఫహాద్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నాడట సుకుమార్.

దీంతో.. కొంచెం ప్యాచ్ వర్క్ మినహా ‘పుష్ప 2’ మొత్తం షూటింగ్ పూర్తవ్వనున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద.. మొదటి భాగంలో పుష్పరాజ్ గా బన్నీ, భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహాద్ పాత్రల మధ్య స్క్రీన్ స్పేస్ చాలా తక్కువే అయినా.. ఆ ఇంపాక్ట్ స్క్రీన్ పై చాలా ఎక్కువ కనిపించింది. మరి.. రెండో భాగంలో వీరి మధ్య ఉండే సన్నివేశాలు వెండితెరపై ఏ రేంజులో అలరిస్తాయో చూడాలి.

Related Posts