దేశం దాటుతున్న డబుల్ ఇస్మార్ట్

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తోన్న సినిమా డబుల్ ఇస్మార్ట్. పూరీ జగన్నాథ్, ఛార్మీ నిర్మిస్తోన్న ఈ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ అని ముందే చెప్పారు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కు మంచి సెటప్ కుదిరింది. ఆ మూవీ ఫినిషింగ్ లోనే మంచి ఎండింగ్ ఉంటుంది. అందుకే డబుల్ ఇస్మార్ట్ మంచి కొనసాగింపు అవుతుందనుకోవచ్చు.

ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేయాలనేది పూరీ ప్లాన్. ఆ ప్లాన్ లో భాగంగానే విలన్ గా సంజయ్ దత్ ను తీసుకున్నాడు. అతని పాత్ర సినిమాకు కొత్త బలాన్ని ఇస్తుందనుకోవచ్చు.ఇక రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న డబుల్ ఇస్మార్ట్ అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు.ఈ ఫైట్ సీన్ ను ముంబైలో చిత్రీకరించారు.


ఇక నెక్ట్స్ షెడ్యూల్ కోసం టీమ్ మొత్తం విదేశాలకు వెళుతోంది. అంటే దేశం దాటి వెళుతుందన్నమాట.అయితే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ లను ఇంకా ఫైనల్ చేయలేదు. నిజానికి ఇస్మార్ట్ శంకర్ లో ఉన్న నిధి అగర్వాల్ కుఈ చిత్రంలోనూ పాత్ర ఉండే అవకాశం ఉంది. అయినా తన పేరు ఇంకా అనౌన్స్ చేయలేదు టీమ్.

అంటే ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కు ఆ కలరింగ్ వచ్చేలా బాలీవుడ్ బ్యూటీస్ ను తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు అనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా హీరోయిన్ లేకుండానే ఫారెన్ షూటింగ్ అంటే అక్కడ కూడా యాక్షన్ సీక్వెన్స్ లే ఉండే అవకాశం ఉందంటున్నారు.


ఇక ఈ చిత్రాన్ని మార్చి 8న విడుదల చేస్తా అని ఓపెనింగ్ రోజే ప్రకటించాడు పూరీ. మరి ఈ మూవీతో అతని ప్యాన్ ఇండియన్ హిట్ అనే కలలు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి.

Related Posts