‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్.. 85 సెకన్ల ఊర మాస్ ట్రీట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను.. ఉస్తాద్ హీరోగా మార్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇక.. అప్పటికి వరుస ఫ్లాపులతో సతమతమైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను మళ్లీ ఫామ్ లో నిలిపిన సినిమా కూడా ఇదే. అలాంటి ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా రాబోతుంది ‘డబుల్ ఇస్మార్ట్’. మొదటి భాగానికి మించిన రీతిలో డబుల్ డోస్ మాస్ ఎలిమెంట్స్ తో ఎంటర్ టైన్ మెంట్ పంచడానికి ‘డబుల్ ఇస్మార్ట్’తో రెడీ అవుతున్నారు.

85 సెకన్ల నిడివితో రిలీజైన ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ ఆద్యంతం ఊర మాస్ ట్రీట్ అందిస్తోంది. రామ్ మాస్ డైలాగ్స్.. పూరి జగన్నాథ్ టేకింగ్.. సంజయ్ దత్ విలనిజమ్.. కావ్య థాపర్ అందాలు.. మణిశర్మ మెస్మరైజింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఈ టీజర్ లో మచ్చుకు కనిపించాయి.

అయితే.. థియేటర్లో మాత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ మాస్ ట్రీట్ మామూలుగా ఉండేలా లేదు. ఇక.. టీజర్ చివర్లో శివలింగాన్ని చూపిస్తూ.. ఈ మూవీకి డివోషనల్ టచ్ కూడా ఇచ్చాడు పూరి. ఈ మూవీ రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది టీమ్.

Related Posts