శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్యనారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్బంగా “దోస్తాన్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు చేతులమీదుగా గ్రాండ్ రిలీజ్ చేశారు.అనంతరంమంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ.. “దోస్తాన్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని తీశారు అనిపిస్తుంది. మంచి కథను  సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక,నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి.

అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుతూ ఆల్ ద  బెస్ట్ తెలిపారు.దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మగారు మాట్లాడుతూ..మా దోస్తాన్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన మినిష్టర్ హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సిద్ స్వరూప్ అందించిన  కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. నటీ నటులు, టెక్నిషియన్స్  అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో  సినిమా చాలా బాగా వచ్చింది.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు  జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.నటుడు సిద్ స్వరూప్ మాట్లాడుతూ.. మా దోస్తాన్ చిత్ర పోస్టర్ ను విడుదల చేసిన  మంత్రి హరీష్ రావు  గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం లో నటించే అవకాశం కల్పించిన  దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మగారికి ధన్యవాదాలు అన్నారు.