Nagarjuna : మాటల రచయిత వద్దు.. మాస్ డైరెక్టర్ కావాలి

మాటల రచయిత వద్దు.. మాస్ డైరెక్టర్ కావాలి.. అంటున్నాడట నాగార్జున. కొన్నాళ్లుగా వరుసగా డిజాస్టర్స్ చూస్తున్నాడు నాగ్. అటు చూస్తే తన తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ లు మంచి ఫామ్ లో ఉన్నారు. తమ పాత ఇమేజ్ లతోనే వీళ్లు కొత్తగా హిట్స్ కొడుతున్నారు. బట్ నాగ్ లక్ మాత్రం అస్సలు బాలేదీ మధ్య. ప్రస్తుతం కెరీర్ లో 99వ సినిమాకు సిద్ధం అవుతున్నాడు.

ఈ ప్రాజెక్ట్ కోసం రచయిత ప్రసన్న కుమార్ ను దర్శకుడుగా పరిచయం చేయాలనుకున్నాడు. అతను చెప్పిన కథకూ ఓటేశాడు. మధ్యలో ఏమైందో.. అతను చెప్పిన కథను పక్కన బెట్టి.. ఓ మళయాల మూవీని రీమేక్ చేయాలనుకున్నారు. ఆ మాలీవుడ్ మూవీ మాసివ్ గా ఉంటుంది. దాదాపు ఇద్దరు హీరోలుంటారు. సినిమా చాలా రగ్గ్ డ్ గా ఉంటుంది. అలాంటి పాత్ర నాగ్ చేస్తే ఎలా ఉంటుందీ అనుకోనక్కర్లేదు. ఎందుకంట ఈ మూవీలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది.

ఈ తరహా పాత్రలు గతంలో నాగార్జున చేసి ఉన్నాడు. కాకపోతే అతని ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్నిమార్పులు అవసరం. అయితే అసలు ప్రాబ్లమ్ దర్శకుడి దగ్గరే వచ్చిందట. ఇలాంటి సినిమాను ప్రసన్నకుమార్ లాంటి రచయిత హ్యాండిల్ చేయగలడా అనే డౌట్ అందరిలోనూ వచ్చిందట. దీంతో ఇప్పుడు అర్జెంట్ గా ఓ మాస్ డైరెక్టర్ ను పట్టుకుని ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలనుకుంటున్నారట. దీంతో ఈ మూవీతో దర్శకుడుగా మారాలన్న రచయిత ప్రసన్నకుమార్ కల చెదిరినట్టే అంటున్నారు.

నిజానికి ప్రసన్నకుమార్ రాసిన కథలన్నీ పరమరొటీన్ వే. నిజంగానే అలాంటి దర్శకుడు ఈ మళయాల కథను హ్యాండిల్ చేస్తాడు అనుకోలేం. అందువల్ల నాగార్జున మంచి నిర్ణయమే తీసుకున్నాడు అనుకోవచ్చు.
మరోవైపు తన వందో సినిమాకు తమిళ్ దర్శకుడు మోహన్ రాజాను దర్శకుడుగా తీసుకున్నాడు నాగ్. ఆల్రెడీ అతను ఓ కథను సిద్ధం చేస్తున్నాడు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాగానే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. మొత్తగా నాగార్జునకు అర్జెంట్ గా ఓ మాస్ డైరెక్టర్ కావాలన్నమాట.

Related Posts