నాగ చైతన్య తొలి ముద్దు ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

అక్కినేని ఫ్యామిలీలో అందరికంటే కాస్త డిఫరెంట్ గా కనిపించే స్టార్ నాగ చైతన్య. రొమాంటిక్ హీరోగా అక్కినేని లెగసీని ముందుకు తీసుకువెళుతున్నాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా.. తన పని చేసుకుంటూ పోవడం చైతన్య స్టైల్. అందుకే అతనికి సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు.

అయితే కొన్నాళ్ల క్రితం సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీరిది మోస్ట్ లవబుల్ కపుల్ ఇన్ ఇండియాగా చెప్పుకున్నారు.

పెళ్లి తర్వాతా సమంత సినిమాలు చేసేందుకు ఓకే చెప్పి మరింతమందికి నచ్చాడు చైతన్య. బట్ నాలుగేళ్లలోనే వీరు విడిపోయి దేశవ్యాప్తంగా ఎంతోమందికి షాక్ ఇచ్చారు. అందుకు కారణాలు ఎలా ఉన్నా.. ఆ జంటకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. విడిపోయి యేడాది దాటిపోయినా.. ఇప్పటికీ వీరి గురించిన వార్తలు క్రేజీగానే ఉన్నాయి.

అయితే లేటెస్ట్ గా నాగ చైతన్య చెప్పిన ఓవిషయం అందరికీ షాక్ ఇచ్చింది.
చైతన్య రీల్ లైఫ్‌ లోనే కాదు.. రియల్ లైఫ్‌ లో తన ఫస్ట్ కిస్ ఇచ్చింది సమంతకేనట. యస్.. ఈ ఇద్దరూ కలిసి నటించిన ఏమాయ చేశావె సినిమాలో లిప్ లాక్ లు ఉన్నాయి కదా..? అవే తన లైఫ్ లో తొలి అధర చుంబనాలు అని చెప్పి షాక్ ఇచ్చాడు చైతన్య.

మామూలుగా స్టార్స్ వారసులంటే రకరకాలుగా ఊహించుకుంటారు. బట్ చైతూ మాత్రం తనకు చిన్నప్పుడు కొన్ని క్రష్ లు ఉన్నాయి కానీ.. మొదటి ముద్దు మాత్రం సినిమాలోనే ఇచ్చాను అని చెప్పడం. మామూలుగా ఇది పెద్ద వార్త కాదు. కానీ అతను తొలి ముద్దు పెట్టిన ముద్దుగుమ్మ తన మాజీ భార్య కూడా కావడంతో చైతూ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


ప్రస్తుతం కస్టడీ మూవీ ప్రమోషన్స్ లో చైతన్య ఈ మాటలు అన్నాడు. అంతే కాక.. ఇదే చిత్ర ప్రమోషన్ లో గతంలో సమంత గురించి చాలా పాజిటివ్ గా చెప్పాడు. అప్పుడు ఇంకా చాలామందికి నచ్చాడు చైతన్య. ఏదేమైనా ఇవన్నీ ప్రమోషన్ ట్రిక్కులా నిజాలా అనేది పక్కన బెడితే.. మళ్లీ ఈ జంట గురించి అంతా మాట్లాడుకుంటున్నారు అనేది నిజం.

Related Posts