ఈ శుక్రవారం ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..

ప్రతి ఫ్రైడే కొత్త సినిమా పోస్టర్స్ తో థియేటర్స్ అన్నీ కళకళలాడుతుంటాయి. పెద్ద సినిమాలున్నప్పుడు తక్కువ సినిమాలు.. లేనప్పుడు ఎక్కువ సినిమాలు విడుదల కావడం ఎప్పుడూ జరిగేదే. అప్పుడప్పుడూ మాత్రం అదేదో క్లియరెన్స్ మాదిరిగా ఆరేడు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. వీటిలో మీడియం రేంజ్ నుంచి మినీ మూవీస్ వరకూ ఉంటాయి. వెల్ నోన్ ఆర్టిస్టుల నుంచి అసలు తెలియని వారి సినిమాల వరకూ వుంటాయి. అలా ఈ నెల 15, 16తేదీల్లో ఏకంగా ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వీటిలో కాస్త ఎక్కువ తెలిసిన సినిమా అంటే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మాత్రమే కనిపిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కాబోతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటించారు. ఓ ఫిల్మ్ డైరెక్టర్ కీ, డాక్టర్ కీ మధ్య జరిగే కథగా కనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది.

ఆల్రెడీ ఇంద్రగంటి – సుధీర్ కాంబోలో ఇంతకు ముందు సమ్మోహనం అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చింది. ఆ మధ్య వి అనే యాక్షన్ ఎంటర్టైనర్ కూడా వచ్చింది. హ్యాట్రిక్ మూవీగా వస్తోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిజల్ట్ కోసం ఇండస్ట్రీ కూడా ఆసక్తిగానే చూస్తుండటం విశేషం.ఇక ఆ తర్వాత కనిపిస్తోన్న సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్యదీప్తి నిర్మించిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరపు, సంజనా ఆనంద్ జంటగా నటించారు. ఎస్వీ క�