Sarath babu : శరత్ బాబు పెళ్లి, వివాదం గురించి మీకు తెలుసా..?

సహజ నటుడు, విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న శరత్ బాబు ఈ సోమవారం(22.05.2023) మధ్యాహ్నం కన్నుమూశారు.

సినిమాల్లో ఎంతో సాత్వికమైన పాత్రలు పోషించారు. మరెన్నో త్యాగపూరితమైన ఉదాత్తమైన క్యారెక్టర్లతో ఆకట్టుకున్నాడు. శరత్ బాబు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. స్వయంకృషితోనే ఎదిగారు. అలా ఎదుగుతున్న క్రమంలోనే నటి రమాప్రభతో పరిచయం అయింది. అప్పటికే రమాప్రభ టాలీవుడ్ లో టాప్ యాక్ట్రెస్. రాజబాబు, చలం, పద్మనాభం వంటి నటులతో తిరుగులేని జోడీ అనిపించుకుంది. ఓ దశలో రమాప్రభ డేట్స్ దొరికితేనే హీరోల డేట్స్ తీసుకునేవారు. అంత బిజీయొస్ట్ యాక్ట్రెస్ రమాప్రభ. అలాంటి నటితో శరత్ బాబుకు పరిచయం ప్రేమకు దారితీసింది.

విశేషం ఏంటంటే.. శరత్ కంటే రమాప్రభ ఆరేళ్లు పెద్ద. అయినా మనసులు కలిశాయి కాబట్టి మనువు చేసుకున్నారు. కానీ వీరి వివాహం మూణ్నాళ్ల ముచ్చటగానే సాగింది. పెళ్లైనా రెండేళ్లకే మనస్ఫర్థలు మొదలయ్యాయి. ఇద్దరూ ఒకే ఫీల్డ్ లో ఉండటం.. ఆ టైమ్ కు ఈ ఫీల్డ్ గురించి రకరకాల రూమర్స్ ఉండటంతో పాటు సంపాదనలోనూ వ్యత్యాలున్నాయి. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవి. ఈ క్రమంలోనే కేవలం మూడు నాలుగేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. వీరు మళ్లీ కలుస్తారని భావించారు చాలామంది. ఇంకెంతోమంది ఇద్దరికీ తెలిసిన స్నేహితులు కలపాలని కూడా ప్రయత్నించారు. కానీ ఇద్దరూ మొండిగానే ఉన్నారు. దీంతో విడిపోయిన పదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.

అంటే కలిసి లేకపోయినా వీరి వైవాహిక జీవితం సాగింది కేవలం 14యేళ్లు. అయితే అప్పటి వరకూ తన వద్ద ఉన్నదంతా శరత్ బాబు తీసుకువెళ్లాడని ఆరోపణలు చేసింది రమాప్రభ. ఆమె నుంచి చిల్లగవ్వ తీసుకోలేదని ఖండించాడు శరత్ బాబు. నిజాలు ఏంటనేది ఆ ఇద్దరి మాత్రమే తెలుసు. కానీ ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ వేరే పెళ్లి చేసుకోలేదు.


ఇక వీరి ప్రేమ, పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా రమాప్రభ సీరియస్ గానే సమాధానాలు చెబుతుంది. అటు శరత్ బాబు మాత్రం అది ముగిసిపోయిన కథ. అసలు మాది ప్రేమే లేని పెళ్లి.. ఇన్ వాలిడ్ మ్యారేజ్ అంటాడు. ఏదేమైనా ఆ రోజుల్లో చాలామంది నటులు రెండో పెళ్లి చేసుకోవడం ద్వారా పాడైపోయారు. వీరు మొదటి పెళ్లితోనే ఆగిపోయి జీవితాంతం ఒంటరిగా ఉన్నారు. మరి వీరి మధ్య అసలేం జరిగింది.. విడిపోవడానికి దారితీసిన పరిణామాలేంటీ అనేది ఆ ఇద్దరికి మాత్రమే తెలిసిన సీక్రెట్. అది ఇద్దరూ ఇప్పటి వరకూ చెప్పలేదు. శరత్ ఇంక చెప్పలేడు.

Related Posts