HomeMoviesటాలీవుడ్‘కల్కి‘ నుంచి దిశా పటాని ఫస్ట్ లుక్

‘కల్కి‘ నుంచి దిశా పటాని ఫస్ట్ లుక్

-

ది మోస్ట్ అవైటింగ్ మూవీ ‘కల్కి‘ ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్. ఈనెలలోనే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా ప్రచార చిత్రాలను వదులుతుంది. ఇక.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి హీరోయిన్ దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అంతేకాకుండా.. ఈ సినిమాలో దిశా పోషిస్తున్న క్యారెక్టర్ నేమ్ కూడా రివీల్ చేసింది.

‘కల్కి‘ ట్రైలర్ లోనే దిశా పటాని పాత్రకు సంబంధించి కొద్దిసేపు విజువల్స్ చూపించారు. ఆమె మోడర్న్ గెటప్ లో కనిపించింది. ఇప్పుడు అదే గెటప్ తో ఉన్న పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఆమె పోషిస్తున్న పాత్ర పేరు రోక్సీ అని రివీల్ చేసింది మూవీ టీమ్. ఈరోజు (జూన్ 13) దిశా పటాని బర్త్ డే స్పెషల్ గా ఈ స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఇక.. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా దిశా పటాని కనిపించబోతుంది. ప్రభాస్-దిశా మధ్య వచ్చే ఓ రొమాంటిక్ డ్యూయెట్ సినిమాకే హైలైట్ కానుందట.

ఇవీ చదవండి

English News