HomeMoviesటాలీవుడ్దర్శకుడు క్రిష్ రెండో వివాహం!

దర్శకుడు క్రిష్ రెండో వివాహం!

-

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను క్రిష్ వివాహం చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువుల సమక్షంలో ఈ వివాహం వైభవంగా జరిగింది. సోషల్ మీడియాలో ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

గతంలో క్రిష్ డాక్టర్ రమ్యను వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ప్రీతి చల్లాతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన క్రిష్‌కు ప్రేక్షకులు, సినీ వర్గాలు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ నుంచి తప్పుకున్న క్రిష్.. ప్రస్తుతం అనుష్క శెట్టితో ‘ఘాటి’ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ కి మంచి స్పందన దక్కింది. త్వరలోనే పాన్ ఇండియా లెవెల్ లో ‘ఘాటి’ విడుదలకానుంది.

ఇవీ చదవండి

English News