HomeMoviesటాలీవుడ్"ధూం ధాం" సినిమా కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు!!

“ధూం ధాం” సినిమా కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు!!

-

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. ఈ మూవీ లో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ గురించి ప్రొడ్యూసర్ రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడారు.

ప్రొడ్యూసర్ రామ్ కుమార్ మాట్లాడుతూ

“ధూం ధాం” సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. థియేటర్స్ లోకి వెళ్లిన వాళ్లంతా ఎంటర్ టైన్ అవుతున్నారు. కలెక్షన్స్ బాగున్నాయి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆడియెన్స్ థియేటర్స్ కు వెళ్తున్నారు. ఒక థియేటర్ లో కామన్ ఆడియెన్స్ తో కలిసి హీరో చేతన్ సినిమా చూశాడు. వారు మూవీని బాగా ఎంజాయ్ చేయడం గమనించి హ్యాపీగా ఫీలయ్యాడు.

సినిమా పూర్తయ్యాక ఆడియెన్స్ చేతన్ ను గుర్తుపట్టి అభినందించారు. సక్సెస్ ఫుల్ హీరోలంతా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించిన వాళ్లే. చేతన్ కూడా అలాగే పేరు తెచ్చుకున్నాడు.మా సంస్థలో నెక్ట్ మూవీని మరికొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తాం. బయట హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశం లేదు. చేతన్ తోనే మా నెక్ట్ మూవీ ఉంటుంది అని అన్నారు.

ఇవీ చదవండి

English News