సైకో థ్రిల్లర్ గా రాబోతున్న ధన్సిక ‘దక్షిణ’

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సైకో థ్రిల్లర్ మూవీ ‘దక్షిణ’. ‘మంత్ర, మంగళ’ వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీస్ కు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చిన ఓషో తులసీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్ లో అశోక్ షిండే నిర్మిస్తున్న ఈ మూవీలో రిషవ్ బసు మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘దక్షిణ’ మూవీ నుంచి ట్రైలర్ రిలీజయ్యింది.

ఒక సీరియల్ సైకో కిల్లర్ యువతులను చంపుకుంటూ వెళుతుంటాడు. ఆతనిని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ గా ధన్సిక రంగంలోకి దిగుతుంది. ఈ కేసు విషయంలో ఆమెకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది మిగిలిన కథ. పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో ‘దక్షిణ’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts