బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4కి అల్లు అర్జున్ హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ ఎపిసోడ్ లోని ఫస్ట్ పార్ట్ విడుదలై ఆకట్టుకుంటుంది. ఫస్ట్ పార్ట్ లో అల్లు అర్జున్ తో పాటు ఆయన తల్లి నిర్మల, స్నేహితుడు సందీప్ పాల్గొన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా బాలయ్య విత్ బన్నీ ఎపిసోడ్ లో సెకండ్ పార్ట్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది.
ఈ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ కూడా సందడి చేశారు. అర్హాని తెలుగు వచ్చా అని బాలయ్య అడిగినందుకే.. తెలుగులో పెద్ద పద్యం పాడి వినిపించింది అల్లు అర్హా. అలాగే అయాన్ సైతం పలు ఆసక్తికర విశేషాలను ఈ షోలో పంచుకున్నట్టు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.
ఈ ప్రోమోలో మరో హైలైట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఫోన్ ఇన్. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీని లైన్లోకి తీసుకున్న బాలకృష్ణ.. బన్నీ గురించి పలు ఆసక్తికర విశేషాలను అడిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ‘పుష్ప 2‘ స్టోరీ గురించి దేవిశ్రీ ఏదో లీక్ చేసినట్టు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. దానికి అల్లు అర్జున్ వద్దు వద్దు అంటూ దేవిశ్రీని వారించినట్టు అనిపిస్తుంది.
అసలు దేవిశ్రీప్రసాద్ ‘పుష్ప 2‘ గురించి ఏం చెప్పాడు? స్టోరీలో మెయిన్ పాయింట్ లీక్ చేశాడా? అనేది నవంబర్ 22న ఈ ఫుల్ ఎపిసోడ్ వస్తేనే కానీ అర్థం కాదు. మరోవైపు ‘పుష్ప 2‘ నుంచి దేవిశ్రీప్రసాద్ తప్పుకున్నాడనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. ఈ సినిమాకి కేవలం పాటలు మాత్రమే దేవిశ్రీ అందించాడని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చారనేది మేకర్స్ కూడా ఒప్పుకున్న విషయమే.
అయితే ‘పుష్ప 2‘ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తో చేయించడం వెనుక దేవిశ్రీ సమ్మతం ఉన్నట్టు ఈ లేటెస్ట్ బన్నీ-డి.ఎస్.పి. కాన్వర్జేషన్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి.. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ అందించిన దేవిశ్రీప్రసాద్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బంధం కొంచెం కూడా చెక్కుచెదరలేదు అనేది ఈ లేటెస్ట్ ‘అన్ స్టాపబుల్‘ ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది.