HomeMoviesటాలీవుడ్‘దేవర‘ రొమాంటిక్ సాంగ్ ‘చుట్టమల్లే‘ వచ్చేసింది

‘దేవర‘ రొమాంటిక్ సాంగ్ ‘చుట్టమల్లే‘ వచ్చేసింది

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర‘ నుంచి మోస్ట్ అవైటింగ్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది. ‘చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమాను నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్నాపు.. రా.. నా నిద్దర కులాసా.. నీ కలలకిచ్చేసా.. నీ కోసం వయసు వాకిలి కాసా.. ‘ అంటూ రామజోగయ్య శాస్త్రి రొమాంటిక్ రాసిన ఈ గీతాన్ని శిల్పారావు అంతే రొమాంటిక్ గా ఆలపించింది.

అనిరుధ్ స్వరకల్పనలో మెలోడియస్ గా తీర్చిదిద్దిన ఈ గీతంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ రొమాన్స్ మరో లెవెల్ లో ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ లిరికల్ సాంగ్ లో మచ్చుకు కొన్ని రొమాంటిక్ సీన్స్ ను అందించారు. అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాటలో ఎన్టీఆర్ మ్యాన్లీ లుక్ లో మెస్మరైజ్ చేస్తుంటే.. అతిలోక సుందరిలా కనిపిస్తున్న జాన్వీ తన అందాలతో మైమరిపిస్తుంది. ఓవరాల్ గా మెలోడియస్ గా ఉన్న ఈ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది.

ఇవీ చదవండి

English News