గోవా ఫారెస్ట్ లో ‘దేవర’ యాక్షన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’. అసలు అక్టోబర్ లోనే రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ లోనే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ‘దేవర’ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఇప్పటికే పలు క్రేజీ అప్డేట్స్ అందించింది టీమ్. ఇప్పటివరకూ ఎన్టీఆర్ ను చూడనటువంటి ఊర మాస్ అవతార్ ను ‘దేవర’లో చూపించబోతున్నాడట డైరెక్టర్ కొరటాల శివ.

ఇక.. లేటెస్ట్ గా గోవాలోని అటవీ ప్రాంతంలో ‘దేవర’కి సంబంధించి అద్భుతమైన యాక్షన్ ఘట్టాన్ని పూర్తిచేశారట. హీరో ఎన్టీఆర్, విలన్ సైఫ్ ఆలీ ఖాన్ మధ్య చిత్రీకరించిన ఈ సీక్వెన్స్ చాలా బాగా వచ్చిందని చెబుతూ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే.. ఈ సీక్వెన్స్ ను తెరకెక్కించడానికి చిత్రబృందం చాలా కష్టపడిందట. భారీ వర్షాలు, బ్యాడ్ వెదర్ లో షూట్ ను పూర్తిచేశారట. ఈ యాక్షన్ పార్ట్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసేందుకు సహకరించిన తన కెమెరా టీమ్, లైట్ టీమ్, స్టంట్ టీమ్ కు కృతఙ్ఞతలు తెలిపాడు స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.

Related Posts