దీపిక ధర్నాలో ఉంది.. అందుకే రాలేదు

దీపికా పదుకొనె.. ప్రాజెక్ట్ కే హీరోయిన్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. నిన్న(గురువారం) యూఎస్ఏలోని శాండియాగో కామిక్ కాన్ ఫెస్ట్ కు అటెండ్ కాలేదు.పైగా ఈ సినిమా గ్లింప్స్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

దీంతో మేకర్స్ కు, దీపికకు మధ్య ఏవో డిఫరెన్సెస్ వచ్చాయి అనుకున్నారు. నిజానికి ఇంత పెద్ద సినిమాలో నటిస్తోన్న తను ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో కామన్ ఆడియన్స్ సైతం అదే భావిస్తున్నారు. బట్ తను అక్కడికి వెళ్లకపోవడానికి, మూవీ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడానికి పెద్ద కారణమే ఉంది. ప్రస్తుతం తను ఓ ధర్నాలో ఉంది. అందులో భాగంగానే ఈ మూవీ ప్రమోషన్స్ కు వెళ్లలేదు. హీరోయిన్లు ధర్నా చేయడం ఏంటీ అనిపిస్తోంది కదూ. యస్.. దేరీజ్ ద పాయింట్.


దీపికా పదుకోణ్ ఇండియాలోనే కాదు.. అమెరికన్ యాక్టర్స్ అసోసియేషన్ లోనూ మెంబర్. దాన్ని వాళ్లు.. ” స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ – అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్ (SAG – AFTRA)” అనే పేరు పెట్టుకున్నారు. దీంతో పాటు ఈ యేడాదే ” రైటర్స్ గిల్డ్ ఆఫ్ ఆమెరికా(WGA)” అని మరోటి స్థాపించారు. ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి అక్కడ ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్స్ కు ఇస్తోన్న రెమ్యూనరేషన్ లో ఉన్న తేడాల పై పోరాటం చేస్తున్నారు.అంటే తమ రెమ్యూనరేషన్స్ తక్కువగా ఉందని.. ఇది చాలా దారుణం అంటూ కొన్నాళ్లుగా సినిమా షూటింగ్స్ ను కూడా ఆపేశారు.

సో.. ఆ యూనియన్ మెంబర్ గా దీపికా పదుకోణ్ ప్రాజెక్ట్ కే ఫంక్షన్ కు అటెండ్ కాలేదు. దీని గురించీ మాట్లాడలేదు. అంతే తప్ప.. మేకర్స్ కు ఆమెకు మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇంకా చెబితే టీజర్ లో తను ప్రభాస్ తో పాటుగా హైలెట్ అయింది.


ఏదేమైనా మన తెలుగులో బాలీవుడ్ నుంచి వచ్చే హీరోయిన్లు కనీసం సభ్యత్వం తీసుకోరు. అయినా వారిని మహారాణుల్లా చూస్తుంటారు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్. దీపిక ఏకంగా హాలీవుడ్ లోమెంబర్ షిప్ తీసుకోవడమే కాదు.. అక్కడ తోటి నటుల పారితోషికాలపై చూపిస్తోన్న వివక్షకు మద్ధతుగానూ నిలబడింది. హ్యాట్సాఫ్ ను దీపిక.

Related Posts