కన్నడలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాలీ ధనుంజయ్ ‘పుష్ప’ మూవీతో తెలుగు వారికీ పరిచయమే. ‘పుష్ప’లో జాలి రెడ్డిగా ధనుంజయ్ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లేటెస్ట్ గా ఈ కన్నడ స్టార్ ‘జీబ్రా’ సినిమాతో తెలుగు వారి ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో సత్యదేవ్ తో పాటు డాలీ ధనుంజయ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘తేరే బినా’ అంటూ సాగే గీతం విడుదలైంది. ఈ పాటలో డాలీ ధనుంజయ్, అమృత అయ్యంగర్ సందడి చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతంలో కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని ఐరా ఉడుపి, సంతోష్ వెంకీ ఆలపించారు. ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ‘జీబ్రా’ చిత్రం నవంబర్ 22న విడుదలకు ముస్తాబవుతుంది.