కస్టడీ యూఎస్ఏ రివ్యూ

అక్కినేని నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ శుక్రవారం ఇండియాలో విడదలవుతోంది. ఇండియా కంటే ఒకరోజు ముందుగానే యూఎస్ లో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..


1990ల కాలంలో సాగే కథ ఇది. శివ( నాగ చైతన్య) రేవతి( కృతిశెట్టి) క్లాస్ మేట్స్, కాలేజ్ డేస్ నుంచే ప్రేమించుకుంటారు. శివకు లైఫ్‌ లో ఏదైనా సాధించాలనే పెద్ద గోల్ ఉంటుంది. చాలా నిజాయితీ పరుడు కూడా. కానీ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల కానిస్టేబుల్ గా మారతాడు. సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అవుతాడు. తన పై ఆఫీసర్ ఎలాంటి వాడైనా నిజాయితీకే నిలబడే గుణం శివది. అలాంటి వ్యక్తి రాజు అనే క్రిమినల్ ను అరెస్ట్ చేస్తాడు. కానీ అతని బ్యాక్ గ్రౌండ్ తెలియకపోవడం వల్ల శివ.. రాజు వల్ల తర్వాత అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తాడు. అయినా అతన్ని మళ్లీ అరెస్ట్ చేసి కోర్ట్ లో అప్ప జెప్పాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వీరి మధ్య ఉన్న రిలేషన్ తో పాటు రాజు క్రిమినల్ యాంగిల్ లో ఒక్కో షాకింగ్ ఇష్యూ తెలుస్తూ ఉంటుంది. అలా తెలిసిన ప్రతిసారీ కథలో ఎవరరూ ఊహించని ట్విస్ట్ లు వస్తుంటాయి. మరి ఆ ఇష్యూస్ ఏంటీ.. ఈ ట్విస్ట్ లను శివ ఎలా సాల్వ్ చేశాడు అనేది రేసీగా సాగే స్క్రీన్ ప్లే తో తెలుస్తుంది..

మామూలుగా వెంకట్ ప్రభు సినిమా అంటే రొటీన్ స్టఫ్ ఉండదు. సినిమా పోయినా ఏదో ఒక కొత్త పాయింట్ ను టేస్ట్ చేయిస్తాడు. అదీ అతని స్టైల్. అందుకే వెంకట్ కు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఫస్ట్ టైమ్ తెలుగులో సినిమా చేస్తున్నాడు అంటే ఇంకా జాగ్రత్త తీసుకుని ఉంటాడు కదా..? అదే చేశాడు. ఓ సాధారణ కథకు తనదైన బ్రిలియంట్ స్క్రీన్ ప్లేను జోడించి అదరగొట్టాడు. సినిమా మొదలైన అరగంట వరకూ మామూలుగా అనిపించినా.. అరవింద్ స్వామి ఎంట్రీతో కథలో వేగం మొదలవుతుంది.

Aravind Swami at 63rd Filmfare Awards 2016 (South) Press Meet

ఎప్పుడైతే అరవింద్ స్వామి, చైతన్య మధ్య వార్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి స్క్రీన్ ప్లే రేసీగా సాగుతుంది. ఇక కృతి శెట్టి ఇప్పటి వరకూ చేయని పాత్ర ఇది. బాగా ఇంప్రూవ్ అయింది. తన నటన, లుక్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. శరత్ కుమార్ రోల్ ఊహించని విధంగా ట్విస్ట్ ఇస్తుంది. ఇతర పాత్రలన్నీ ఎవరికి వారు ది బెస్ట్ ఇచ్చారు.నాగ చైతన్య కెరీర్ బెస్ట్ రోల్ ఇది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలాంటి పాత్రలు చేయాలంటే కథను బలంగా నమ్మితే తప్ప సాధ్యం కాదు. అరవింద్ స్వామితో పాటు కృతిశెట్టితో వచ్చే కొన్నిసన్నివేశాల్లో అతని నటనకు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. అరవింద్ స్వామి ఎందుకు తన పాత్రల విషయంలో సెలెక్టివ్ గా ఉంటాడో మరోసారి ప్రూవ్ అయింది.


టెక్నికల్ గా ఈ చిత్రానికి బ్యాక్ బోన్ తండ్రి కొడుకులైన ఇళయరాజా, యువన్ శంకర్ రాజాల మ్యూజిక్. పాటలు గొప్పగా అనిపించవు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం అద్భుతం. కథనంతో పాటు సన్నివేశాలకు తగ్గట్టుగా ఒకప్పటి రాజా ను గుర్తుకు చేస్తూ నేపథ్య సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్ లో నిలబెట్టింది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. మాటలు బావున్నాయి. 90ల నాటి కాలాన్ని గుర్తు చేసేలా ఆర్ట్ వర్క్, సెట్ ప్రాపర్టీస్ నేచులర్ గా ఉన్నాయి. దర్శకుడుగా వెంకట్ ప్రభుకు తెలుగులోనూ క్రేజ్ ను తెస్తుందీ సినిమా. అంత బాగా రాసుకున్నాడు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయం సాధిస్తుందో చూడాలి

Related Posts