‘మిస్టర్ బచ్చన్‘ నుంచి క్రేజీ రొమాంటిక్ సాంగ్

మాస్ మహారాజ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ‘మిస్టర్ బచ్చన్‘ నుంచి మోస్ట్ అవైటింగ్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది. ‘సితార్‘ అంటూ సాగే ఈ పాటను మిక్కీ జె మేయర్ స్వరకల్పనలో సాహితీ రాయగా.. సాకేత్ కోమండూరి, సమీర భరద్వాజ్ ఆలపించారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సేపై చిత్రీకరించిన ఈ పాట రొమాంటిక్ గా ఆకట్టుకుంటుంది.

తెలుగులో తొలి చిత్రమే అయినా.. ఈ మూవీతో భాగ్యశ్రీ టాలీవుడ్ లో హాట్ ఫేవరెట్ గా మారిపోతుందడానికి ఈ పాట ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ సాంగ్ లో రవితేజ, భాగ్యశ్రీ పోటాపోటీగా రొమాంటిక్ స్టెప్స్ తో రెచ్చిపోయారు.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ‘మిస్టర్ బచ్చన్‘ను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మూవీ ‘రైడ్‘ రీమేక్ గా తెరకెక్కుతోన్న ‘మిస్టర్ బచ్చన్‘ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts