నాగ చైతన్య తో వంటలక్క ..

వంటలక్క అనగానే తెలుగు నాట ఎంత ఫేమస్ అనేది కొత్తగాచెప్పాల్సిన పనిలేదు. మా టివిలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ తో ఓ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుంది తను. కాస్త డీ గ్లామర్ పాత్రలో కంప్లీట్ మెలో డ్రామాతో కనిపించిన తన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సీరియల్ రేటింగ్ మేజర్ షేర్ వంటలక్కదే అంటే అతిశయోక్తి కాదు. అన్నట్టు ఈమె పేరు సీరియల్ లో దీప. హీరో పేరు కార్తీక్. అందుకే కార్తీక దీపం అని పెట్టారు. బట్ ఈ ఇద్దరూ వంటలక్క, డాక్టర్ బాబుగానే ఫేమస్ అయ్యారు. అయితే సీరియల్ తో ఎక్కువ ఇమేజ్ ను తెచ్చుకుంది మాత్రం దీప. తన అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. మళయాలి. అక్కడ చాలా సీరియల్స్ లో పెద్దగా రాని గుర్తింపు తనకు కార్తీక దీపం తెచ్చింది. ఈ సీరియల్ వల్ల తనకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఇమేజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అందుకే తనను సినిమాల్లో నటింప చేయాలని చాలామంది ప్రయత్నించారు.

బట్ అందరికీ నో చెప్పింది. అంతే కాదు.. ఇతర టీవి షోస్ లో కూడా ఎక్కువగా కనిపించలేదు. అలాంటితన నాగ చైతన్య సినిమాలో నటించేందుకు ఒప్పుకుని సడెన్ గా సర్ ప్రైజ్ చేసింది.నాగ చైతన్య 22వ సినిమాలో ప్రేమి విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదల కాబోతోంది. ఎవర్ హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి చైతూకు విలన్ గా నటిస్తున్నాడు. ఇళయరాజాతో పాటు ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సంయుక్తంగా ఈ మూవీకి సంగీతం అందిస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఈ వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ చేస్తోన్న పాత్రలో మొదట ప్రియమణిని తీసుకున్నారు. అనౌన్స్ మెంట్ కూడా అయింది. మరి తను తప్పుకుందా లేక తప్పించారా అనేది తెలియదు కానీ.. ఇప్పుడు ఆ రోల్ లోకి ఈ డస్కీ బ్యూటీ వచ్చింది. మొత్తంగా పాత్ర నచ్చకపోతే ప్రేమి విశ్వనాథ్ ఓకే చెప్పదు. అంచేత ఈ మూవీలో తన క్యారెక్టర్ కీలకమే అయి ఉంటుందనుకోవచ్చు.

Related Posts