తెలుగువాడు సాధించాడు. ఇన్నేళ్లుగా ఎంతోమంది బెస్ట్ యాక్టర్స్ ఉన్నా.. ఇప్పటి వరకూ మనకు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఒక్క జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ కూడా రాలేదు. పాటలకు ఇతర విభాగాల్లో వచ్చింది. ఆ లోటును పూడ్చాడు మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్.
తను ఎంతగానో నమ్మి, ప్రేమించి చేసిన పుష్ప ద రైజ్ సినిమాకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఈ అవార్డ్ సాధించిన మొట్ట మొదటి తెలుగు నటుడు అల్లు అర్జున్ కావడం విశేషం. ఈ అవార్డ్ అల్లు అర్జున్ పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలం. ఈ సినిమా కోసం అతనెంతో కష్టపడ్డాడు. రాత్రింబవళ్లు అడవుల్లో తిరుగుతూ అక్కడే ఉంటూ ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఓ పెద్ద విజయం సాధించాడు.
స్టైలిష్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న అతను డీ గ్లామర్ రోల్ చేసి మెప్పించడం ఆషామాషీ విషయం కాదు. ఈ విజయం ఊహించిందే అయినా తీవ్రమైన పోటీ కూడా ఉండటంతో చాలామంది డౌట్ పడ్డారు. బట్ ఎంత పోటీ ఉన్నా చివరికి తెలుగోడే విజయం సాధించాడు. మన అల్లు అర్జున్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు. ఆ కేటగిరీలో చూస్తే తెలుగు నుంచి అత్యుత్తమ నటుడు కూడా అతనే. కంగ్రాట్యులేషన్స్ ఐకన్ స్టార్.. పార్టీ లేదా పుష్పా..