జూలై 19న రాబోతున్న ప్రియదర్శి ‘డార్లింగ్‘

కమెడియన్ గా స్టార్ రేసులో ఉన్న ప్రియదర్శి.. కథానాయకుడిగానూ విలక్షణమైన సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రియదర్శి హీరోగా నటించిన ‘మల్లేశం, బలగం‘ వంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక.. ముగ్గురు హీరోలలో తాను ఒకడిగా నటించిన ‘జాతి రత్నాలు, ఓం భీమ్ బుష్‘ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. మరోవైపు.. ఓటీటీ కోసం చేసిన ‘సేవ్ ది టైగర్స్‘ సిరీస్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శికి జోడీగా నటిస్తుంది. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలతో ‘డార్లింగ్‘పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది టీమ్. జూలై 19న ‘డార్లింగ్‘ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts